ట్రంప్ ప్రభుత్వం సుంకాల బెదిరింపులు, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ద్వేషం చాలా ఖర్చు, గందరగోళాన్ని సృష్టిస్తున్నదని ఫోర్డ్ సీఈవో జిమ్ ఫర్లీ అన్నారు. అమెరికా తయారీకి ప్రాధాన్యమని ట్రంప్ చెప్పినప్పటికీ టారిఫ్ ప్రణాళిక కారణంగా విధాన అనిశ్చితి నెలకొన్నదన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా ఉన్న పన్ను క్రెడిట్లను వెనక్కి తీసుకుంటారా? కొనసాగిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదన్నారు. మెక్సికో, కెనడాపై 25 శాతం సుంకాలు యూఎస్ కపెనీలకు ఆపదగా పరిణమిస్తుందని జిమ్ ఫర్లీ వ్యాఖ్యానించారు.
Add A Comment