Top Best Selling Two Wheelers | దేశంలో టాప్ బెస్ట్ సెల్లింగ్ బైక్‌లివే.. హీరో స్ప్లెండర్ నుంచి టీవీఎస్ అపాచీ వరకూ.. ఇవీ డిటైల్స్..!
Top Selling Two Wheelers | టూ వీలర్స్‌కు ప్రపంచంలోకెల్లా ద్విచక్ర వాహనాలకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. భారత్‌లో తక్కువ ఖర్చు, మెరుగైన ఫ్యుయల్ ఎఫిషియెన్సీ, చౌకధరకు లభించే మోటారు సైకిళ్లకు, స్కూటర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.
భారత్‌లో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడంటే ఆకర్షణీయ ఫీచర్లతో, సేఫ్టీ ఆప్షన్లతో రకరకాల కార్లు వచ్చేశాయ్ గానీ, గతంలో ప్రతి ఒక్కరూ ఆఫీసుకు వెళ్లాలన్నా, ఏదైనా సమీప ప్రాంతానికి వెళ్లాలన్నా టూవీలర్సే ఆధారం. ద్విచక్ర వాహనాలకు దేశంలో కొదవలేదు. ఐసీఈ పవర్డ్ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు కోకొల్లలు. టూ వీలర్స్‌కు ప్రపంచంలోకెల్లా ద్విచక్ర వాహనాలకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. భారత్‌లో తక్కువ ఖర్చు, మెరుగైన ఫ్యుయల్ ఎఫిషియెన్సీ, చౌకధరకు లభించే మోటారు సైకిళ్లకు, స్కూటర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ మోటారు సైకిళ్ల గురించి తెలుసుకుందామా..!
బెస్ట్ మోటారు బైక్ హీరో స్ప్లెండర్
ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ నుంచి బెస్ట్ మోటారు సైకిల్ హీరో స్ప్లెండర్ (Hero Splendor). పలు వేరియంట్లలో హీరో స్ప్లెండర్ అందుబాటులో ఉంది. దీని ధరలు రూ.75,141 నుంచి రూ.92,549 (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. హీరో స్ప్లెండర్ మోటారు సైకిల్ ఇంజిన్ 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 7.9 బీహెచ్‌పీ విద్యుత్, 8.05 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
మెరుగైన సేల్స్‌తో హోండా షైన్ ఇలా
హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) ఆధ్వర్యంలో ఎక్కువగా అమ్ముడవుతున్న మోటారు సైకిల్ హోండా షైన్ (Honda Shine). ఈ మోటారు సైకిల్ రూ. 79,800- రూ. 83,800 (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. హోండా షైన్ మోటారు బైక్ 123.94సీసీ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 10.74 బీహెచ్‌పీ విద్యుత్, 11 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
బెస్ట్ బైక్ బజాజ్ పల్సర్
బజాజ్ ఆటో నుంచి దేశంలో వెలువడిన మోటారు సైకిళ్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ బజాజ్ పల్సర్. ఈ బైక్ పలు వేరియంట్లు - బజాజ్ పల్సర్ 125, బజాజ్ పల్సర్ 150, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, బజాజ్ పల్సర్ ఎన్ 160, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, బజాజ్ పల్సర్ ఎన్ 250 తదితర వేరియంట్లలో లభ్యం అవుతుంది. వీటిల్లో అత్యంత చౌక వేరియంట్.. బజాజ్ పల్సర్ 125 మోటారు సైకిల్ ధర రూ.85,618 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ వేరియంట్లలో అత్యంత ఖర్చుతో కూడుకున్న బజాజ్ పల్సర్ ఆర్ఎస్ మోడల్ రూ.1.71 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
అదే బాటలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్
హీరో మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న, అత్యధికంగా అమ్ముడవుతున్న మోటారు బైక్‌ల్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి. దీని ధరలు రూ.59,998 నుంచి రూ.68,768 వరకూ (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ మోటారు సైకిల్ ఇంజిన్ 97.2 సీసీ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 8బీహెచ్‌పీ విద్యుత్, 8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
పల్సర్ తర్వాతీ స్థానంలో ప్లాటినా
బజాజ్ పల్సర్ తర్వాత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటారు సైకిళ్లలో బజాజ్ ప్లాటినా ఒకటి. అది దేశంలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 100 ధర రూ.67,808 (ఎక్స్ షోరూమ్), బజాజ్ ప్లాటినా 110 బైక్ రూ.70,400 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. బజాజ్ ప్లాటినా100 బైక్ 102 సీసీ ఇంజిన్, బజాజ్ ప్లాటినా 110 మోటారు సైకిల్ 115 సీసీ ఇంజిన్‌తో పని చేస్తుంది.
ఇలా టీవీఎస్ అపాచీ సేల్స్
దేశంలోని ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థల్లో ఒకటి టీవీఎస్ మోటార్స్ సైకిల్స్ ఒకటి. టీవీఎస్ మోటార్ సైకిల్స్ ఆధ్వర్యంలోని టీవీఎస్ అపాచీ బైక్ అత్యధికంగా అమ్ముడవుతున్నది. టీవీఎస్ అపాచీ పలు వేరియంట్లలో లభిస్తుంది. టీవీఎస్ ఆర్టీఆర్ 160, టీవీఎస్ ఆర్టీఆర్ 160 4వీ, టీవీఎస్ ఆర్టీఆర్ 310, టీవీఎస్ ఆర్‌ఆర్ 310, టీవీఎస్ ఆర్టీఆర్ 180, టీవీఎస్ ఆర్టీఆర్ 200 4వీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ మోటారు సైకిళ్ల ధరలు రూ.1.19 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.2.72 లక్షల వరకూ (ఎక్స్ షోరూమ్) పలుకుతాయి.