Top Selling Cars | వరుసగా రెండో నెలలో మారుతిని బీట్ చేసిన టాటా పంచ్.. టాప్-10లో ఏడు మారుతి కార్లే..!
Top Selling Cars | రోజురోజుకు కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. వివిధ కార్ల తయారీ సంస్థలు కొత్త డిజైన్లు, ఫీచర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.
Top Selling Cars | రోజురోజుకు కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. వివిధ కార్ల తయారీ సంస్థలు కొత్త డిజైన్లు, ఫీచర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిదే మార్కెట్‌లో ప్రధాన వాటా. టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలోనే మారుతిదే పైచేయి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్ నెలలో కొత్త కార్ల అమ్మకాల్లో వరుసగా రెండో నెల రికార్డు నమోదైంది. మారుతి సుజుకి కార్లను పక్కనబెట్టి టాటా మోటార్స్ ముందుకు దూసుకు వచ్చింది. టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఏడు మారుతి సుజుకికి చెందిన మోడల్ కార్లు కాగా, మిగతా మూడు సంస్థ (టాటా మోటార్స్), హ్యుండాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలకు చెందిన ఒక్కో కారు అమ్ముడు పోయాయి.
ప్రతి నెలా మాదిరిగానే ఏప్రిల్ నెలలో పది బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఎస్‌యూవీ కార్ల ఆధిపత్యమే కొనసాగుతున్నది. వాటిల్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ఐదు ఎస్‌యూవీలు, మారుతి సుజుకికి చెందిన రెండు హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక సెడాన్, ఒక ఎంపీవీ, ఒక వ్యాన్ ఉన్నాయి. టాటా పంచ్, మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి బ్రెజా, మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి ఎకో టాప్ సెల్లింగ్ కార్లుగా నిలిచాయి.
టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ మోడల్ కారు టాటా పంచ్ సేల్స్ ఇంప్రెసివ్‌గా నిలిచాయి. వరుసగా రెండో నెలలో ఏప్రిల్‌లోనూ బెస్ట్ సెల్లర్ కారుగా టాటా పంచ్ నిలిచింది. గత నెలలో టాటా పంచ్ 19,158 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతీ స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 17,850 యూనిట్లతో రెండో స్థానంలో, మారుతి సుజుకి బ్రెజా 17,113 యూనిట్ల విక్రయంతో మూడో స్థానంలో నిలిచాయి.
ఇక మారుతి సుజుకిలో సెడాన్ సెగ్మెంట్‌లో ఏండ్ల తరబడి అమ్ముడవుతున్న కారు డిజైర్.. మారుతి సుజుకికి కీలకంగా మారింది. ఏప్రిల్ నెలలో డిజైర్ కార్లు 15,825 యూనిట్లు విక్రయించగా, మారుతి సుజుకి బాలెనో 15,447 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో ఎన్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 14,807 యూనిట్లను విక్రయించారు.
తదుపరి వంతు మారుతి సుజుకిదే. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 14,286 యూనిట్స్, మారుతి బాలెనో 14,049 యూనిట్లు విక్రయించింది. మల్టీ పర్పస్ వెహికల్ ఫ్లాగ్‌షిప్ కారు ఎర్టిగా 13,544 యూనిట్లు, వ్యాన్ సెగ్మెంట్‌లో ఎకో 12,060 కార్లు విక్రయించింది.
ఏప్రిల్‌లో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవేనా
టాటా పంచ్ - 19,158 యూనిట్లు
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - 17,850 యూనిట్లు
మారుతి సుజుకి బ్రెజా - 17,113 యూనిట్లు
మారుతి సుజుకి డిజైర్ - 15,825 యూనిట్లు
హ్యుండాయ్ క్రెటా - 15,447 యూనిట్లు
మహీంద్రా స్కార్పియో - 14,807 యూనిట్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ - 14,286 యూనిట్లు
మారుతి సుజుకి బాలెనో - 14,049 యూనిట్లు
మారుతి సుజుకి ఎర్టిగా (ఎంపీవీ) - 13,544 యూనిట్లు
మారుతి సుజుకి ఎకో (వ్యాన్) - 12,060 యూనిట్లు