Telugu Global
Business

క్రెడిట్ కార్డుని సరిగ్గా వాడుకునేందుకు చిట్కాలు!

అత్యవసర పరిస్థితుల్లో అప్పు ఇచ్చే క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డు వాడకానికి ఒకసారి అలవాటు పడితే అదొక వ్యసనంగా మారే ప్రమాదమూ ఉంది.

క్రెడిట్ కార్డుని సరిగ్గా వాడుకునేందుకు చిట్కాలు!
X

అత్యవసర పరిస్థితుల్లో అప్పు ఇచ్చే క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డు వాడకానికి ఒకసారి అలవాటు పడితే అదొక వ్యసనంగా మారే ప్రమాదమూ ఉంది. అందుకే దీన్ని వాడడంలో కొన్ని జాగ్రత్తలు ముఖ్యం.

క్రెడిట్‌ కార్డులను అవసరాలకు వాడుకుంటేనే బాగుంటుంది. ముందుగానే నెలజీతాన్ని అందించే ఈ కార్డులకు అలవాటు పడిపోతే ఆర్థిక క్రమశిక్షణ లోపించి అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డుని తెలివిగా ఎలా వాడాలంటే..

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు వీలైనంత వరకూ తక్కువ లిమిట్ ఉన్నవాటినే ఎంచుకోవాలి. నెల జీతంలో ముప్ఫై నుంచి నలభై శాతం లెక్కించుకుని అంతమొత్తాన్నే క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేయాలి. అంతకు మించి ఖర్చు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.

క్రెడిట్‌ కార్డు బిల్లులను గడువు కంటే ముందే చెల్లిస్తే మంచిది. మినిమమ్ డ్యూ జోలికి వెళ్లుకుండా ఎప్పటికప్పుడు ఫుల్ పేమెంట్ చేసేయాలి. ఇలా చేస్తే క్రెడిట్‌ స్కోరు పెరగడంతోపాటు ఎక్స్‌ట్రా ఫీజుల భారం ఉండదు.

క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్ చూడకుండానే బిల్లు చెల్లించేస్తుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు బ్యాంకులు మీకు చెప్పకుండా కొన్ని అదనపు ఛార్జీలు వేస్తుంటాయి. ఎప్పటికప్పుడు స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవడం ద్వారా వేటికి ఛార్జీలు పడుతున్నాయో గుర్తించి వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

చాలా రకాల క్రెడిట్ కార్డులు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ల వంటివి ఆఫర్ చేస్తాయి. వాటిని చెక్ చేసుకోకపోతే ఆయా బెనిఫిట్స్‌ను వృథాగా వదిలేసినట్టే. కాబట్టి క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు ఆయా యాప్స్‌ను వాడుతూ రివార్డు పాయింట్లను ఉపయోగించుకునేలా చూసుకోవాలి.

First Published:  18 Jun 2024 8:00 AM IST
Next Story