Telugu Global
Business

Maruti Suzuki Grand Vitara | మారుతి `శిఖ‌`లో మ‌రో మైలురాయి.. రెండు ల‌క్ష‌ల యూనిట్లు దాటిన గ్రాండ్ విటారా సేల్స్‌..!

Maruti Suzuki Grand Vitara | మారుతి సుజుకి గ్రాండ్ విటారా తొలి ల‌క్ష యూనిట్ల కార్లు అమ్మ‌డానికి ఏడాది టైం ప‌డితే, మ‌రో ల‌క్ష కార్ల విక్ర‌యానికి కేవ‌లం 10 నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది.

Maruti Suzuki Grand Vitara | మారుతి `శిఖ‌`లో మ‌రో మైలురాయి.. రెండు ల‌క్ష‌ల యూనిట్లు దాటిన గ్రాండ్ విటారా సేల్స్‌..!
X

Maruti Suzuki Grand Vitara | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). అధునాత‌న టెక్నాల‌జీతోపాటు క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా స‌రికొత్త మోడ‌ల్ కార్ల‌తో మార్కెట్లోకి దూసుకొస్తోంది. త‌ద‌నుగుణంగా మారుతి సుజుకి (Maruti Suzuki) `శిఖ‌`లో మ‌రో మైలురాయి న‌మోదైంది. మారుతి సుజుకి (Maruti Suzuki) 2022 సెప్టెంబ‌ర్‌లో ఆవిష్క‌రించిన‌ మిడ్ సైజ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా (Grand Vitara) కేవ‌లం 23 నెల‌ల్లోనే రెండు ల‌క్ష‌ల కార్లు విక్ర‌యించిన మైలురాయిని దాటింది. హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), ట‌యోలా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder), హోండా ఎలివేట్ (Honda Elevate), స్కోడా కుషాక్ (Skoda Kushaq), ఫోక్స్ వ్యాగ‌న్ టైగూన్ (Volkswagen Taigun), ఎంజీ అస్ట‌ర్ (MG Astor) మోడ‌ల్ కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara).

మారుతి సుజుకి గ్రాండ్ విటారా తొలి ల‌క్ష యూనిట్ల కార్లు అమ్మ‌డానికి ఏడాది టైం ప‌డితే, మ‌రో ల‌క్ష కార్ల విక్ర‌యానికి కేవ‌లం 10 నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రీడ్‌, ఎస్‌-సీఎన్జీ వేరియంట్ల ప‌ట్ల క‌స్ట‌మ‌ర్ల‌లో మంచి గిరాకీ పెరిగింది. దేశంలో కార్ల విక్ర‌యాల్లో అత్య‌ధిక వాటా పొందిన గ్రాండ్ విటారా (Grand Vitara)కు మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 12 శాతం సాధించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) కారు ధ‌ర రూ.10.99 ల‌క్ష‌ల నుంచి రూ.20.09 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) వ‌ర‌కూ ప‌లుకుతోంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) కారు 1.5 లీట‌ర్ల ఇంటెలిజెంట్ ఎల‌క్ట్రిక్ హైబ్రీడ్ ప‌వ‌ర్ ట్రైన్ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఈ-సీవీటీ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రీడ్ ప‌వ‌ర్ ట్రైన్ ఇంజిన్ గ‌రిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్‌, 122 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది.

ఇంకా మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) కారు 1.5 లీట‌ర్ల కే సిరీస్ డ్యుయ‌ల్ జెట్‌, డ్యుయ‌ల్ వీవీటీ ఇంజిన్ విత్ స్మార్ట్ హైబ్రీడ్ టెక్నాల‌జీతో వ‌స్తోంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 103 బీహెచ్పీ విద్యుత్‌, 137 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. సీఎన్జీ ఆప్ష‌న్ ఇంజిన్ గ‌రిష్టంగా 87 బీహెచ్పీ విద్యుత్‌, 121 ఎన్ఎం టార్క్ వెలువ‌రించ‌డంతోపాటు 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌లో అందుబాటులో ఉంది. కే-సిరీస్ ఫోర్‌వీల్ డ్రైవ్ ఆప్ష‌న్ (సుజుకి ఆల్ గ్రిప్ టెక్నాల‌జీ)తో వ‌స్తోంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆటో, స్పోర్ట్‌, స్నో, లాక్ డ్రైవ్ మోడ్స్‌లో ల‌భిస్తుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) కారు 9- అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సిస్ట‌మ్‌, హెడ్ అప్ డిస్‌ప్లే (హెచ్‌యూడీ), 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ చార్జ‌ర్‌, ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, వెంటిలేటెడ్ సీట్స్‌, క్లారియ‌న్ ప్రీమియం సౌండ్ సిస్ట‌మ్‌, పీఎం 2.5 ఎయిర్ క్యాబిన్ ఫిల్ట‌ర్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారు స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ గ్రాండ్ విటారా కారులో ప‌లు యాక్టివ్‌, పాసివ్ సేఫ్టీ ఫీచ‌ర్ల‌తోపాటు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్‌, టైర్ ప్రెష‌ర్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌, న్యూలీ ఇంట్ర‌డ్యూస్డ్ అక్యూస్టిక్ వెహిక‌ల్ అల‌ర్టింగ్ సిస్ట‌మ్ (ఏవీఏఎస్‌) తదిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

First Published:  30 July 2024 2:41 PM IST
Next Story