Tata Punch | ఈ కారు మారుతి సుజుకి బ్రాండ్ ఆధిపత్యానికి చెక్ పెట్టిందిలా.. టాటా పంచ్ పై చేయి..!
Tata Punch | మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచేవి. కానీ, ఇప్పుడు మారుతి సుజుకి కార్ల ఆధిపత్యాన్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బద్దలు కొట్టింది. గత నెలలో టాప్-10 కార్లలో టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్ అవతరించింది.
Tata Punch | సుదీర్ఘ కాలం తర్వాత మారుతి సుజుకి ఆధిపత్యానికి బ్రేక్ పడింది. ప్రతి నెలా టాప్-10 కార్లలో మారుతి సుజుకి కార్లే ఎక్కువగా ఉండేవి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచేవి. కానీ, ఇప్పుడు మారుతి సుజుకి కార్ల ఆధిపత్యాన్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బద్దలు కొట్టింది. గత నెలలో టాప్-10 కార్లలో టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్ అవతరించింది.
గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కారు టాటా పంచ్ నిలిచింది. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) వర్షన్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ 17,547 కార్లు విక్రయిస్తున్నది. ఈ కారు ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.20 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. టాటా పంచ్ 1.2 లీటర్ల రివోట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 88 పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ వర్షన్‌లోనూ టాటా పంచ్ అందుబాటులో ఉంటుంది. టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో వస్తుంది. సీఎన్జీ వేరియంట్ గరిష్టంగా 73 పీఎస్ విద్యుత్, 103 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
టాటా పంచ్.ఈవీ కారు రూ.10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు పలుకుతుంది. టాటా పంచ్.ఈవీ స్టాండర్డ్ వేరియంట్ 60కిలోవాట్ల మోటార్ (114 ఎన్ఎం టార్క్), 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న కారు సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 90 కిలోవాట్ల మోటార్ (190 ఎన్ఎం టార్క్), 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న టాటా పంచ్.ఈవీ కారు సింగిల్ చార్జింగ్‌తో 421 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. టాటా పంచ్ తర్వాత హ్యుండాయ్ క్రెటా 16,458 యూనిట్లు విక్రయించగా, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 16,368, మారుతి సుజుకి డిజైర్ 15,894, మారుతి సుజుకి స్విఫ్ట్ 15,728 కార్లు విక్రయించింది.