Telugu Global
Business

జాబ్‌లో ప్రమోట్ అవ్వాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే!

ఈ రోజుల్లో పని చేసే చోట రాణించడం చాలా కష్టంగా మారుతోంది చాలామందికి. టాలెంట్ ఉన్నాఎదగలేక పోతున్నవాళ్లు కొందరైతే.. ఎదుగుతున్నా, సంతృప్తి చెందలేకపోతున్నవాళ్లు మరికొందరు.

జాబ్‌లో ప్రమోట్ అవ్వాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే!
X

ఈ రోజుల్లో పని చేసే చోట రాణించడం చాలా కష్టంగా మారుతోంది చాలామందికి. టాలెంట్ ఉన్నాఎదగలేక పోతున్నవాళ్లు కొందరైతే.. ఎదుగుతున్నా, సంతృప్తి చెందలేకపోతున్నవాళ్లు మరికొందరు. దీనికి ముఖ్య కారణం సాఫ్ట్‌స్కిల్స్‌ లేకపోవడమే అని సర్వేలు చెప్తున్నాయి. మరి ఇవి ఎలా డెవలప్ చేసుకోవాలి?

పని చేసే చోట సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని అడ్వాన్స్‌డ్ స్కిల్స్‌ని పెంపొందించుకుంటే వర్క్ ప్లేస్ ఎలాంటి ఇబ్బందులకు లోనవకుండా సక్సెస్ అవ్వొచ్చని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం..

క్రియేటివిటీ

ఏ రంగంలో అయినా క్రియేటివిటీ ఉన్న వారికి ఎటువంటి సమస్య అయినా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. క్రియేటివిటీని పెంపొందించుకుంటే ప్రతీ సమస్యని భిన్నంగా చూసే వీలుంటుంది. అంతేకాకుండా అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ ఆలోచించేవాళ్లకు ప్రతీ చోట ఒక ప్రత్యేకత ఉంటుంది. దీన్ని పెంపొందించుకోవడం కోసం ఒకేలా ఆలోచించడం మానుకుని కొత్త పద్ధతుల్లో సమస్యను ఎలా పరిష్కరించాలో ప్రయోగాలు చేసి చూడాలి.

కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

కాంప్లెక్స్ అంటే చాలా క్లిష్టమైనది అని అర్ధం. క్లిష్టమైన సమస్యను గుర్తించి దానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మార్గాలను కనుక్కోవాలి. వాటిని అమలు చేసే విధానాన్నే కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంటారు. ప్రస్తుతం మీరు చేస్తున్న రంగ౦లో వచ్చిన, రాబోతున్న మార్పులన్నిటికీ ఇదే కారణం. ప్రొఫెషనల్‌ సర్వీస్‌, ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్ చాలా అవసరం.

క్రిటికల్‌ థింకింగ్‌

ఒక విషయాన్ని లాజికల్‌గా, విమర్శనాత్మకంగా ఎనలైజ్ చేయడాన్నే క్రిటికల్‌ థింకింగ్‌ అ౦టారు. రాబోయే కాలంలో ప్రతీ రంగంలో మరిన్ని సవాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే క్రిటికల్‌ థింకింగ్‌ను ఉద్యోగానికి కావాల్సిన తప్పనిసరి స్కిల్ గా భావించాలి. మీరు ఫేస్ చేసిన ఇంటర్వ్యూల్లో కూడా దీనిపై ప్రశ్నలు అడిగే ఉంటారు.

పీపుల్‌ మేనేజ్‌మెంట్‌

ఇతరులను ఆకట్టుకోవడానికి కావల్సిన లక్షణాలు, చాతుర్యం, సామర్థ్యాలు వంటివి పీపుల్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ కిందకు వస్తాయి. ఆఫీస్‌ వ్యవహారాలు, క్లయింట్స్‌, కొలీగ్స్‌తో చర్చలు జరిపేటపుడు ఈ స్కిల్స్‌ చాలా కీలకం.

ఫ్లెక్సిబిలిటీ

ఫ్లెక్సీబిలిటీ అంటే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇట్టే ఇమిడిపోయేలా మనల్ని మనం మార్చుకోవాలి. కొలీగ్స్‌తో సమన్వయంతో వ్యవహరిస్తూ ఫ్లెక్సిబుల్‌గా వ్యవహరించే గుణం ఉన్న వారికి ఆఫీస్‌లో అందరూ ప్రాధాన్యత ఇస్తారు.

ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్

ఎప్పుడూ కోప్పడే వాళ్లని, మాటిమాటికి అలిగే వాళ్లని ఎవరూ అంత త్వరగా ఇష్టపడరు. అందుకే ప్రతీ ఎమోషన్‌ని తెలివిగా వ్యక్తపరచాలి. ఇదే ఎమోషనల్ ఇంటిలిజెన్స్. ఒత్తిడిని తట్టుకోవడం, అన్ని పరిస్థితుల్లో మంచిగా కమ్యూనికేట్ చేయగలగడం వంటివి ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌లో భాగం.

జడ్జిమెంట్‌

వర్క్‌ప్లేస్‌ను ప్రభావితం చేసే మరో కీలక నైపుణ్యం జడ్జిమెంట్‌ అండ్‌ డెసిషన్ మేకింగ్‌. వేగంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయం తీసుకోవడం, జవాబుదారీగా ఉండటం, ప్రాబ్లమ్‌కి ఉన్న సొల్యూషన్స్‌లో బెస్ట్ సొల్యూషన్‌ని ఎంచుకోవడం వంటివి ఈ స్కిల్‌ కిందకి వస్తాయి. రాబోయే కాలంలో వర్క్‌ప్లేస్‌లో వచ్చే మార్పులకనుగుణంగా సత్వర నిర్ణయాలతో దూసుకెళ్లే ప్రొఫెషనల్స్‌ అవసరం. కాబట్టి ఈ స్కిల్‌ను పెంపొందించుకోవడం ముఖ్యం.

First Published:  17 Jan 2024 3:51 PM IST
Next Story