టాప్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేస్ బెంజ్ కొత్త ఏడాదిలో ధరలు పెంచబోతుంది. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి పెంచబోయే ధరలు అమల్లోకి రానున్నాయి. మూడు శాతం ధరలు పెంచనున్నట్టు మెర్సిడేస్ బెంజ్ ప్రకటించింది. ధరల పెంపుతో భారత దేశంలో బెంజ్ కార్ల ధరలు తక్కువలో తక్కువగా రూ.2 లక్షల నుంచి మొదలుకొని అత్యధికంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశముందని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ద్రవ్యోల్బణం, ఫ్యూయల్ చార్జీల్లో ఫ్లక్చువేషన్ కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని మెర్సిడేస్ బెంజ్ ఇండియా సీఈవో సంతోష్ అయ్యర్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు బుక్ చేసుకునే వెహికిల్స్ కు మాత్రం పెంపు వర్తించదని స్పష్టం చేశారు. ఇండియా మార్కెట్ లో మెర్సిడేస్ బెంజ్ తక్కువలో తక్కువగా రూ.45 లక్షల కారు నుంచి అత్యధికంగా రూ.3.6 కోట్ల విలువైన జీ63 ఎస్‌యూవీ వరకు పలు రకాల మోడళ్లలో కార్లను విక్రయిస్తోంది.
Previous Articleప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య
Next Article మహిళ స్వశక్తి సంఘాలకు సోలార్ ప్లాంట్లు
Keep Reading
Add A Comment