Tata Curvv EV | ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. త్వరలో టాటాకర్వ్.ఈవీ లాంచింగ్.. ఇవీ దీని ప్రత్యేకతలు..!
Tata Curvv EV | తాజాగా మరో ఈవీ `కర్వ్.ఈవీ (Curvv EV) కారు ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది.

Tata Curvv EV | సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లలో ఇప్పటికీ మారుతి సుజుకి ఇండియాదే ఆధిపత్యం. ఇప్పుడిప్పుడే దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా, దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పోటీ పడుతున్నా.. మారుతి సుజుకి కార్లదే హవా. పర్యావరణ పరిరక్షణతోపాటు భారీగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు, విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్ నిల్వలు) పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచ దేశాల్లో పౌరులు విద్యుత్ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల తయారీలో మారుతి సుజుకి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆల్టర్నేటివ్ ఫ్యుయల్.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు భారతీయులు కూడా బాగానే అట్రాక్ట్ అవుతున్నారు.
సంప్రదాయ ఐసీఈ ఇంజిన్ కార్లలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) పై మోజు పెంచుకుంటున్నట్లే, ఈవీ కార్ల పైనా భారతీయులు మనస్సు పారేసుకుంటున్నారు. సంప్రదాయ ఇంజిన్ కార్ల సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఫస్ట్ స్థానంలోనే కొనసాగుతుంటే, ఈవీ కార్ల విభాగంలో టాటా మోటార్స్ (Tata Motors) ముందు వరుసలో నిలుస్తోంది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తెచ్చిన టాటా మోటార్స్.. తాజాగా మరో ఈవీ `కర్వ్.ఈవీ (Curvv EV) కారు ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో టాటా కర్వ్.ఈవీ, టాటా కర్వ్‌వి కారుకు సంబంధించిన కొన్ని డిజైన్లను టాటా మోటార్స్ టీజ్ చేసింది.
న్యూ ఐకాన్ - న్యూ సిల్‌హౌటీ - ఎస్‌యూవీ కూపే. #టాటాకర్వ్‌వీ#టాటాకర్వ్ఈవీ (#TataCURVV #TataCurvvEV) త్వరలో మార్కెట్‌లోకి వస్తోంది అంటూ టాటా మోటార్స్ టీజర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం టాటా మోటార్స్ నాలుగు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. టాటా మోటార్స్‌కు చెందిన టాటా టియాగో.ఈవీ (Tata Tiago EV) (రూ.7.99 లక్షలు), టాటా పంచ్.ఈవీ (Tata Punch EV) (రూ.10.99 లక్షలు), టాటా టైగోర్.ఈవీ (Tata Tigor EV) (రూ.12.49 లక్షలు), టాటా నెక్సాన్.ఈవీ (Tata Nexon EV) (రూ.14.49 లక్షలు) పలుకుతుంది. త్వరలో మార్కెట్‌లోకి రానున్న టాటా కర్వ్.ఈవీ (Tata Curvv EV) కారు ధర.. టాటా నెక్సాన్.ఈవీ (Tata Nexon EV) కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇంతకుముందే ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) మోడల్ టాటా కర్వ్ ఎస్‌యూవీతోపాటు టాటా కర్వ్.ఈవీ కారును కూడా దేశీయ రోడ్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కార్లలో మాదిరిగా టాటా కర్వ్.ఈవీలోనూ వైడ్ ఎయిర్ డ్యామ్‌తోపాటు టాల్ బంపర్ జత చేశారు. లార్జర్ బ్యాటరీ ప్యాక్‌తోపాటు సింగిల్ చార్జింగ్‌తో 400-500 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం గల పవర్ ట్రైన్ ఇంజిన్ ఇందులో ఉంటుందని భావిస్తున్నారు. టాటా నెక్సాన్.ఈవీ కంటే పెద్దదైన 30.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో టాటా కర్వ్.ఈవీ వస్తుందని తెలుస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో మెరుగ్గా డ్రైవింగ్ చేసేందుకు వీలుగా ఆల్ వీల్ డ్రైవింగ్ కేపబిలిటీ గల డ్యుయల్ మోటార్ సెటప్ కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు.
A new icon – A new silhouette – An SUV coupé#TataCURVV #TataCurvvEV - coming soon.
— TATA.ev (@Tataev) July 6, 2024
#SUVCoupe #ShapedForYou #TataEV #MoveWithMeaning #TataMotors #TataMotorsPassengerVehicles
*T&C Apply pic.twitter.com/jdLEFsw8e8