Telugu Global
Business

Tata Motors | టియాగో& నెక్సాన్ ఈవీ కార్ల‌పై టాటా మోటార్స్ భారీ ధ‌ర‌ల త‌గ్గింపు.. కార‌ణాలివేనా..?!

Tata Motors | ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్లో 70 శాతం వాటా క‌లిగిన టాటా మోటార్స్ త‌న సేల్స్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. అందులో భాగంగా త‌న ఎల‌క్ట్రిక్ కార్లు టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడ‌ల్ కార్ల‌పై భారీగా రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ధ‌ర‌లు త‌గ్గించివేసింది.

Tata Motors | టియాగో& నెక్సాన్ ఈవీ కార్ల‌పై టాటా మోటార్స్ భారీ ధ‌ర‌ల త‌గ్గింపు.. కార‌ణాలివేనా..?!
X

Tata Motors | ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్లో 70 శాతం వాటా క‌లిగిన టాటా మోటార్స్ త‌న సేల్స్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. అందులో భాగంగా త‌న ఎల‌క్ట్రిక్ కార్లు టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడ‌ల్ కార్ల‌పై భారీగా రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ధ‌ర‌లు త‌గ్గించివేసింది. ఎల‌క్ట్రిక్ కార్లలో కీల‌క‌మైన బ్యాట‌రీ సెల్స్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌డంతో టాటా మోటార్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ కార్ల ధ‌ర‌లు మాత్ర‌మే త‌గ్గించిన టాటా మోటార్స్‌.. ఇటీవ‌లే మార్కెట్లో ఆవిష్క‌రించిన టాటా పంచ్ ఈవీ కారు ధ‌ర య‌థాత‌థంగా కొన‌సాగించింది. ధ‌ర‌ల త‌గ్గింపు తర్వాత టాటా టియాగో ఈవీ కారు ధ‌ర రూ.7.99 ల‌క్ష‌ల నుంచి టాటా నెక్సాన్ ఈవీ మీడియం రేంజ్ కారు ధ‌ర రూ.14.49 ల‌క్ష‌లు, టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ ధ‌ర రూ.16.99 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది.

2022 అక్టోబ‌ర్‌లో ఆవిష్క‌రించిన టాటా టియాగో ఈవీ కారు ధ‌ర రూ8.49 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. ఇటీవ‌ల రూ.12 ల‌క్ష‌ల‌కు టాటా పంచ్ ఈవీ ఆవిష్క‌రించే వ‌ర‌కూ టాటా మోటార్స్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌లో టాటా నెక్సాన్ ఈవీ అతి చౌక కారు. టాటా నెక్సాన్. ఈవీ కారు ధ‌ర రూ.14.70 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా నెక్సాన్ ఈవీ మూడు వేరియంట్లు - క్రియేటివ్‌, ఫియ‌ర్‌లెస్‌, ఎంప‌వ‌ర్డ్ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. మీడియం రేంజ్ వ‌ర్ష‌న్ సింగిల్ చార్జింగ్‌తో 350 కి.మీ, లాంగ్ రేంజ్ వ‌ర్ష‌న్ 465 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. టాటా టియాగో ఈవీ కారు నాలుగు వేరియంట్లు -ఎక్స్ఈ, ఎక్స్‌టీ, ఎక్స్‌జ‌డ్‌+, ఎక్స్‌జ‌డ్‌+ ల‌క్స్ మోడ‌ల్స్‌లో అందుబాటులో ఉంది. మీడియం రేంజ్ సింగిల్ చార్జింగ్ చేస్తే 250 కి.మీ, లాంగ్ రేంజ్ వేరియంట్ 315 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. ఎంజీ మోటార్స్ `కామెట్ ఈవీ`తో పోలిస్తే టాటా టియాగో బేస్ వేరియంట్ ధ‌ర రూ.ల‌క్ష ఎక్కువ‌. ఎంజీ మోటార్స్ త‌న కామెట్ ఈవీ కారు ధ‌ర ఇటీవ‌లే త‌గ్గించేసింది.

టాటా ప్యాసింజ‌ర్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) చీఫ్ క‌మర్షియ‌ల్ ఆఫీస‌ర్ వివేక్ శ్రీవాత్స‌వ మాట్లాడుతూ.. `ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీలో బ్యాట‌రీ ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా ప్ర‌భావం చూపుతుంది. ఇటీవ‌ల బ్యాట‌రీ సెల్స్ ధ‌ర‌లు త‌గ్గాయి. బ్యాట‌రీ సెల్స్ ధ‌ర త‌గ్గింపుతో నేరుగా క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌బ్ది చేకూర్చాల‌ని నిర్ణ‌యించాం. కొన్నేండ్లుగా ఈవీ కార్లు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఈవీ కార్ల‌ను ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తేవాల‌ని మా ప్ర‌య‌త్నం. వివిధ బాడీ స్టైల్స్‌, శ్రేణుల‌తో స్మార్ట్‌, రిచ్ ఫీచ‌ర్ ఈవీల‌ను అందిస్తున్నాం` అని తెలిపారు.

First Published:  14 Feb 2024 12:45 PM IST
Next Story