Telugu Global
Business

Cars Offers | టాటా.. మ‌హీంద్రా కార్ల‌పై ఆఫ‌ర్ల వ‌ర్షం.. రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ డిస్కౌంట్లు..

Cars Offers | టాటా మోటార్స్ కింగ్ ఆఫ్ ఎస్‌యూవీస్‌ ఫెస్టివల్ కింద గ‌ణ‌నీయంగా ధ‌ర త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Cars Offers | టాటా.. మ‌హీంద్రా కార్ల‌పై ఆఫ‌ర్ల వ‌ర్షం.. రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ డిస్కౌంట్లు..
X

Cars Offers | కార్ల తయారీ సంస్థ‌లు త‌మ కార్ల విక్ర‌యాలు పెంచుకోవ‌డానికి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. దేశీయ కార్ల త‌యారీ సంస్థ‌లు టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఆ బాట‌లో ప‌య‌నిస్తున్నాయి. టాటా మోటార్స్ సంస్థ త‌న ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు 20 ల‌క్ష‌ల యూనిట్ల మైలురాయిని దాటిన శుభ సంద‌ర్భంలో రెండు మోడ‌ల్ కార్ల‌పై ధ‌ర‌ల త‌గ్గింపుతోపాటు స్పెష‌ల్ బెనిఫిట్లు అందిస్తోంది. పాపుల‌ర్ టాటా హారియ‌ర్‌, టాటా స‌ఫారీ మోడ‌ల్ కార్ల‌పై రాయితీలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ కొన‌సాగుతాయని తెలిపింది. కింగ్ ఆఫ్ ఎస్‌యూవీస్‌ అనే ప్ర‌మోష‌న‌ల్ క్యాంపెయిన్ కింద ఈ ఆఫ‌ర్లు అందిస్తోంది టాటా మోటార్స్‌.

టాటా మోటార్స్ కింగ్ ఆఫ్ ఎస్‌యూవీస్‌ ఫెస్టివల్ కింద గ‌ణ‌నీయంగా ధ‌ర త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. టాటా హారియ‌ర్ కారు ధ‌ర రూ.14.99 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా హారియ‌ర్‌పై రూ.50 వేలు ధ‌ర త‌గ్గించేసింది. టాటా స‌ఫారీ కారుపై రూ.70 వేల ధ‌ర త‌గ్గింపుతో రూ.15.49 ల‌క్ష‌ల‌కు దిగి వ‌చ్చింది. ఈ ధ‌ర‌ల త‌గ్గింపుతో రెండు ఎస్‌యూవీ కార్లు - టాటా హారియ‌ర్‌, టాటా స‌ఫారీల‌పై రూ.1.4 ల‌క్ష‌ల వ‌ర‌కూ అద‌న‌పు బెనిఫిట్లు అందిస్తామ‌ని తెలిపింది.

టాటా హారియ‌ర్‌, టాటా స‌ఫారీ కార్లు 2.0-లీట‌ర్ల ఇంజిన్‌, 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌తో మార్కెట్‌లో ఉన్నాయి. టాటా హారియ‌ర్ లీట‌ర్ పెట్రోల్ మీద 16.8 కి.మీ దూరం, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వ‌ర్ష‌న్ లీట‌ర్ పెట్రోల్ మీద 14.6 కి.మీ మైలేజీని ఇస్తుంది. టాటా స‌ఫారీ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లీట‌ర్ పెట్రోల్ మీద 16.3 కి.మీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్ లీట‌ర్ పెట్రోల్ మీద 14.5 కి.మీ మైలేజీ అందిస్తుంది.

నెక్సాన్.ఈవీ, పంచ్‌.ఈవీల మీద ధ‌ర త‌గ్గింపు

టాటా మోటార్స్ త‌న ఎల‌క్ట్రిక్ కార్ల‌పైనా ధ‌ర త‌గ్గింపు ప్ర‌క‌టించింది. టాటా నెక్సాన్.ఈవీపై రూ.1.3 ల‌క్ష‌ల వ‌ర‌కూ డిస్కౌంట్ ల‌భిస్తుంది. టాటా పంచ్‌.ఈవీపై రూ.30 వేల వ‌ర‌కూ రాయితీ పొందొచ్చు. ఇటీవ‌లే టాటా నెక్సాన్‌.ఈవీ కారు ఏడు ల‌క్ష‌ల యూనిట్లు విక్ర‌యించిన మైలురాయిని అధిగ‌మించింది.

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700పై రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కూ రాయితీ

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా పాపుల‌ర్ ఎస్‌యూవీ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 ఆవిష్క‌రించి మూడు వ‌సంతాలు దాటేసింది. అపారమైన డిమాండ్‌, గిరాకీ ఉండ‌టంతో దీని కోసం దీర్ఘ‌కాలిక వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. ఈ సంద‌ర్భంగా మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 ఏఎక్స్‌7 వేరియంట్ మీద రూ.2 ల‌క్ష‌ల పై చిలుకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. నాలుగు నెల‌ల పాటు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే డీజిల్ వేరియంట్ మీద అద‌నంగా రూ.50 వేల డిస్కౌంట్ ఆఫ‌ర్ చేస్తోంది.

First Published:  14 July 2024 8:09 AM GMT
Next Story