Telugu Global
Business

Tata Sons | టాటా స‌న్స్‌పై ఇన్వెస్ట‌ర్ల ల‌వ్ ఇలా.. రూ.9 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన ఎం-క్యాప్‌..!

Tata Sons | ఇటీవ‌లే దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లిస్ట‌యిన టాటా టెక్నాల‌జీస్‌తోపాటు టాటా స‌న్స్ ఆధీనంలోని తొమ్మిది స్టాక్స్ లాభాల పంట తెచ్చి పెట్టింది.

Tata Sons | టాటా స‌న్స్‌పై ఇన్వెస్ట‌ర్ల ల‌వ్ ఇలా.. రూ.9 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన ఎం-క్యాప్‌..!
X

Tata Sons | ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24)లో స్టాక్ మార్కెట్లు టాటా స‌న్స్‌కు తీపి కబురందించింది. ఇటీవ‌లే దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లిస్ట‌యిన టాటా టెక్నాల‌జీస్‌తోపాటు టాటా స‌న్స్ ఆధీనంలోని తొమ్మిది స్టాక్స్ లాభాల పంట తెచ్చి పెట్టింది. టాటా స‌న్స్ స్టాక్స్‌కు 257 శాతం మ‌ల్టీబాగ‌ర్ రిట‌ర్న్స్ ల‌భించాయి. టాటా టెక్నాల‌జీతోపాటు అన్ని టాటా స‌న్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.9.15 ల‌క్ష‌ల కోట్లు పెరిగి, రూ.29.62 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. టాటా స‌న్స్ స్టాక్స్ దాదాపు 45 శాతం రిట‌ర్న్స్ ప్రాఫిట్ సాధించింది. ఇన్వెస్ట‌ర్ల‌కు స‌గ‌టున టాటా స్టాక్స్ 85 శాతం లాభాలిచ్చాయి. సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు మిన‌హా రిటైల్ ఇన్వెస్ట‌ర్ల‌కు భారీ ల‌బ్ధి చేకూరింది.

టాటా స‌న్స్ మిన‌హా టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేష‌న్ స్టాక్‌ 257 శాతం ల‌బ్ధితో టాప్ గెయినర్‌గా నిలిచింది. త‌ర్వాతీ స్థానంలో టాటా కెమిక‌ల్స్ 11 శాతం పుంజుకున్న‌ది. ఆటోమొబైల్ కార్పొరేష‌న్ ఆఫ్ గోవా, ట్రెంట్‌, బెనారెస్ హోట‌ల్స్, టీఆర్ఎఫ్‌, టాటా మోటార్స్‌, ఆర్ట్‌స‌న్ ఇంజినీరింగ్‌, టాటా ప‌వ‌ర్ వంటి టాటాస‌న్స్ అనుబంధ స్టాక్స్ ప్ర‌ధానంగా ల‌బ్ధి పొందిన‌వి. జాగ్వార్ అండ్ లాండ్ రోవ‌ర్‌తోపాటు ఆప‌రేష‌న్స్‌తో లాభాలు గ‌డించిన టాటా మోటార్స్ రిక‌వ‌రీతో 136 శాతం లాభంతో ముగిసింది. టాటా ప‌వ‌ర్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 107 శాతానికి పైగా పుంజుకుని 1.26 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ది. గ‌త న‌వంబ‌ర్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లిస్ట‌యిన టాటా టెక్నాల‌జీస్ షేర్లు 100 శాతం ప్రీమియం ట్రేడ‌వుతున్న‌ది.

టాటా స‌న్స్ అనుబంధ టైటాన్ షేర్ 51 శాతం గ్రీన్‌, టాటా స్టీల్ 49 శాతం, టాటా క‌న్జూమ‌ర్ 54 శాతం, టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) షేర్ 21 శాతం లాభాల‌తో ముగిసింది. మొత్తం టాటా స‌న్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌లో టీసీఎస్ స‌గం ఉంటుంది. గ‌త నెల ఆరో తేదీ గ‌ణాంకాల ప్ర‌కారం టీసీఎస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.15.12 ల‌క్ష‌ల కోట్లు, టాటా మోటార్స్ రూ.3.43 ల‌క్ష‌ల కోట్లు, టైటాన్ రూ.31.6 ల‌క్ష‌ల కోట్లు, టాటా స్టీల్ రూ.1.79 ల‌క్ష‌ల కోట్లు, టాటా ప‌వ‌ర్ రూ.1.25 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. తొలిసారి దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో గ‌త నెల ఆరో తేదీన టాటా స‌న్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.30 ల‌క్ష‌ల కోట్ల మార్క్‌ను దాటేసింది.

స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. టాటా స‌న్స్‌కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయ‌న్నారు. టాటా స‌న్స్ చైర్మ‌న్‌గా ఎన్. చంద్ర‌శేఖ‌ర‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న‌ప్పుడే తాను టాటా సన్స్ స్టాక్స్ కొనుగోలు చేయ‌డం యాదృచ్ఛికం అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, త్వ‌ర‌లో టాటా క్యాపిట‌ల్‌, టాటా ఆటో క్యాంప్ సిస్ట‌మ్స్ వంటి సంస్థ‌లు ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్ల‌లో లిస్ట‌యేందుకు ప్ర‌ణాళిక రూపొందించాయి. వ‌చ్చే రెండు, మూడేండ్ల‌లో టాటా ప్యాసింజ‌ర్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ, బిగ్ బాస్కెట్‌, టాటా డిజిట‌ల్, టాటా ఎల‌క్ట్రానిక్స్‌, టాటా హౌసింగ్, టాటా బ్యాట‌రీస్ వంటి సంస్థ‌లు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ల‌లో లిస్ట‌వుతాయ‌ని తెలుస్తున్న‌ది.

First Published:  30 March 2024 7:28 AM IST
Next Story