Telugu Global
Business

Best Selling Cars | అన్నింటా మారుతి సుజుకిదే డామినెన్స్‌.. బ‌ట్ ఎస్‌యూవీల్లో టాప్ టాటా పంచ్‌..!

Best Selling Cars | జూన్‌లో టాప్ సెల్లింగ్ కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ మొద‌టి స్థానంలో నిలిచింది.

Best Selling Cars | అన్నింటా మారుతి సుజుకిదే డామినెన్స్‌.. బ‌ట్ ఎస్‌యూవీల్లో టాప్ టాటా పంచ్‌..!
X

Best Selling Cars | ప్ర‌స్తుతం ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న వారంతా స్పేసియ‌స్‌గా ఉండే ఎస్‌యూవీ కార్ల‌పై మోజు పారేసుకుంటున్నారు. క‌రోనా త‌ర్వాత ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు రోజురోజుకు పెరిగిపోయాయి. ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న కార్ల విక్ర‌యాల్లో 50 శాతానికి పై చిలుకు ఎస్‌యూవీ సెగ్మెంట్ల‌దే. ఓవ‌రాల్ కార్ల విక్ర‌యాల్లో మాత్ర‌మే కాదు.. ప్ర‌తి నెలా టాప్‌-10 బెస్ట్ కార్ల విక్ర‌యాల్లోనూ ఇది క‌నిపిస్తుంది. జూన్‌లో టాప్ సెల్లింగ్ కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ మొద‌టి స్థానంలో నిలిచింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వ్యాగ‌న్ఆర్‌, స్విఫ్ట్‌, బాలెనో.. ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తుంటే.. ఎస్‌యూవీ కార్ల‌లో మారుతి సుజుకిని టాటా మోటార్స్ కొన్నినెల‌లుగా చాలెంజ్ చేస్తోంది. టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్‌.. టాప్‌-10 కార్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

2024 జూన్‌లో 10- బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఐదు ఎస్‌యూవీ కార్లు నిలిచాయి. మూడు హ్యాచ్‌బ్యాక్ కార్లు, ఒక సెడాన్‌, ఒక మ‌ల్టీ పర్ప‌స్ వెహిక‌ల్ (ఎంవీపీ) టాప్ -10 సెల్లింగ్ కార్ల‌లో ఉన్నాయి. య‌ధావిధిగా మారుతి సుజుకి ఆరు మోడ‌ల్ కార్ల‌లో డామినెన్స్ ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా, టాటా మోటార్స్ నుంచి రెండు, త్వ‌ర‌లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ కానున్న హ్యుండాయ్‌తోపాటు మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా నుంచి ఒక్కో కారు టాప్‌-10 కార్ల‌లో చోటు ద‌క్కించుకున్నాయి.

మొత్తం టాప్‌-10 సంస్థ‌ల్లో టాటా పంచ్ మ‌రోసారి మొద‌టి స్థానంలో నిలిచింది. జూన్ నెల‌లో 18,328 యూనిట్ల కార్ల విక్ర‌యంతో టాప్‌లో నిలిచిన టాటా పంచ్‌.. మార్చి, ఏప్రిల్ నెల‌ల్లోనూ బెస్ట్ సెల్ల‌ర్‌గా ఉంది. నూత‌న మారుతి సుజుకి స్విఫ్ట్ 16,422 యూనిట్ల విక్ర‌యంతో కాస్త క‌స్ట‌మ‌ర్ల మ‌న‌స్సును చూర‌గొంటోంది. హ్యుండాయ్ క్రెటా 16,293 యూనిట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతున్న‌ది.

మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ (ఎంవీపీ) సెగ్మెంట్‌లో మారుతి సుజుకి మ‌రో కారు ఎర్టిగా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో 15,902 యూనిట్లు విక్ర‌యించింది. త‌ర్వాతీ స్థానంలో మారుతి సుజుకి బాలెనో 14,895 యూనిట్లు, మారుతి సుజుకి వ్యాగ‌న్ ఆర్ 13,790 యూనిట్లు అమ్ముడ‌య్యాయి.

సెడాన్ల సెగ్మెంట్‌లోనూ మారుతి సుజుకిదే హ‌వా. గ‌త నెల‌లో అత్య‌ధికంగా అమ్ముడైన సెడాన్ కారు మారుతి సుజుకి డిజైర్‌. 2024 జూన్‌లో 13,421 యూనిట్లు అమ్ముడు పోయాయి. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో మారుతి బ్రెజా స్ఫూర్తిదాయ‌క సేల్స్ న‌మోదు చేసుకుంటున్న‌ది. జూన్‌లో మారుతి బ్రెజా 13,172 యూనిట్లు విక్ర‌యించింది. దేశీయ కార్ల త‌యారీ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా స్కార్పియో (ఎన్‌, క్లాసిక్‌) 12,307 కార్లు అమ్ముడుపోయాయి.

2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ కారుగా టాటా నెక్సాన్ నిలిచింది. గ‌త నెల‌లో టాప్‌10 కార్ల‌లో టాటా నెక్సాన్ ఒక‌టిగా నిలిచింది. గ‌త ఏప్రిల్‌, మే నెల‌ల్లో టాటా నెక్సాన్ కారు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల‌లో ఎంట‌ర్ కాలేదు.

2024 జూన్‌లో అత్య‌ధికంగా అమ్ముడైన టాప్‌-10 కార్లు ఇవే

టాటా పంచ్ - 18,238 యూనిట్లు

మారుతి సుజుకి స్విఫ్ట్ - 16,422 యూనిట్లు

హ్యుండాయ్ క్రెటా- 16,293 యూనిట్లు

మారుతి సుజుకి ఎర్టిగా - 15,902 యూనిట్లు

మారుతి సుజుకి బాలెనో - 14,895 యూనిట్లు

మారుతి సుజుకి వ్యాగ‌న్ ఆర్ - 13,790 యూనిట్లు

మారుతి సుజుకి డిజైర్ - 13,421 యూనిట్లు

మారుతి సుజుకి బ్రెజా - 13,172 యూనిట్లు

మ‌హీంద్రా స్కార్పియో - 12,307 యూనిట్లు

టాటా నెక్సాన్ - 12,066 యూనిట్లు

First Published:  4 July 2024 1:41 PM IST
Next Story