Telugu Global
Business

లాభాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలకు అండగా నిలిచాయి.

లాభాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు
X

దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలకు అండగా నిలిచాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 260 పాయింట్ల లాభంతో 81,727 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 25,063 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 ఎల్‌ అండ్‌టీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలసీజ్‌, పవర్‌గ్రిడ్‌ కారొర్పేషన్‌, టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.95గా కొనసాగుతున్నది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.11 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,631.50 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

First Published:  10 Oct 2024 10:15 AM IST
Next Story