భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
హెచ్‌ఎంపీవీ వైరస్ కలకలం నేపథ్యంలో అభద్రతాభావానికి గురవుతున్న మదుపర్లు
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.16 గంటల సమయానికి సెన్సెక్స్ 920 పాయింట్లు నష్టపోయి 78చ302 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 278 పాయింట్లు నష్టపోయి 23,723 వద్ద ట్రేడవుతున్నది. హెచ్‌ఎంపీవీ వైరస్ కలకలం నేపథ్యంలోమదుపర్లు అభద్రతాభావానికి గురవుతున్నారు. దీంతో మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
చైనాలో పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు భారత్‌లోనూ నమోదు కావడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉదయం ప్లాట్‌గా సూచీలు ప్రారంభం కాగా.. బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ ఉందని గుర్తించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ వార్తలు సూచీలను పడేశాయి.