Telugu Global
Business

మళ్లీ కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

మరింత దిగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌

మళ్లీ కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ నష్టాలు మూట గట్టుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో సెన్సెక్స్‌ భారీగా పతనమైంది. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ 78,495.53 పాయింట్ల వద్ద ప్రారంభమై సాయంత్రం 77,690.95 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా 984 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 324 పాయింట్లు కోల్పోయి 23,559.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటితో పోల్చితే రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడింది. డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.38లుగా ఉంది. టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌ మినహా అన్ని షేర్లు నష్టాలు చవిచూశాయి. మహీంద్ర అండ్‌ మహీంద్ర, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారేల్‌ క్రూడాయిల్‌ ధర 72.30 డాలర్లుగా ఉంది.

First Published:  13 Nov 2024 7:56 PM IST
Next Story