Telugu Global
Business

స్టాక్‌ మార్కెట్లు డౌన్‌.. రూ.6 లక్షల కోట్లు ఉఫ్‌

భారీగా నష్టపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్లు డౌన్‌.. రూ.6 లక్షల కోట్లు ఉఫ్‌
X

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీతో పాటు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ భారీ నష్టాలను చవి చూశాయి. దీంతో ఒక్క సెషన్‌ లోనే రూ.6 లక్షల కోట్ల సంపద ఉఫ్‌ మని ఊదేసినట్టుగా అయ్యింది. సెన్సెక్స్‌ 820 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి మళ్లీ 24 వేల పాయింట్ల దిగువకు చేరింది. సెన్సెక్స్‌ మంగళవారం ఉదయం 79,644.95 పాయింట్ల వద్ద మొదలై లాభాల్లో కొనసాగింది. మధ్యాహ్నం క్రమేణ నష్టాలు మొదలై 820 పాయింట్లు కోల్పోయి 78,675.18 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 23,883.45 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌ తో రూపాయి మారకం విలువ ఆల్‌ టైం లోగా 84.40కు చేరింది. సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడగా, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ నష్టాలు మూటగట్టుకున్నాయి.

First Published:  12 Nov 2024 3:44 PM GMT
Next Story