Telugu Global
Business

కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో దూసుకెళ్తోంది. అందుకే చాలామంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు చూస్తున్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేందుకు ఇది సరైన సమయం అంటున్నారు. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి!
X

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో దూసుకెళ్తోంది. అందుకే చాలామంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు చూస్తున్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేందుకు ఇది సరైన సమయం అంటున్నారు. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..

గడిచిన రెండు మూడేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా పెరిగాయి. చాలామందిలో ఫైనాన్షియల్ లిటరసీ పెరిగి డబ్బుని బ్యాంకుల్లో కాకుండా ఫండ్స్‌ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇలా కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లకు కొన్ని సందేహాలు, భయాలు ఉండడం కామన్. అందుకే వాటిపై ఒక క్లారిటీ తెచ్చుకోవడం అవసరం.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు పదేపదే తమ డబ్బుని చూసుకుంటూ పెరిగిందా? తగ్గిందా? అని కంగారు పడుతుంటారు. మార్కెట్స్ డౌన్ అయినప్పుడు భయపడుతుంటారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌లోకి ఎంటర్ అయ్యేముందు మూడు నాలుగేళ్ల పాటు వాటిజోలికి వెళ్లకూడదు అని డిసైడ్ అయిపోవాలి. మార్కెట్లో వచ్చే అప్ అండ్ డౌన్స్‌కు భయపడకుండా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి లాంగ్ టర్మ్‌లో మాత్రమే లాభాలు ఇస్తాయని తెలుసుకోవాలి.

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కూడా లాంగ్ టర్మ్‌ను దృష్టిలో ఉంచుకునే పెట్టుబడులు పెట్టాలి. అయితే వీటిలో రిస్క్ ఫ్యాక్టర్‌‌ ఎక్కువ. కాబట్టి మీరు ఎంచుకున్న కంపెనీ పని తీరు ఎలా ఉంది? అనేది గమనిస్తూ ఉండడం అవసరం. ఎందుకంటే కంపెనీలు స్థిరంగా ఉండొచ్చు లేదా కొన్నిసార్లు పూర్తిగా నష్టాల్లోకి కూరుకుపోవచ్చు. కాబట్టి గమనిస్తూ ఉంటే సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేముందు ఆయా స్క్రీమ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రిస్క్ ఉంటూ లాంగ్ టర్మ్‌లో లాభాలు ఇచ్చే స్కీమ్స్, రిస్క్ తక్కువ ఉంటూ తక్కువ లాభాలు ఇచ్చే స్కీమ్స్.. ఇలా రెండు రకాలు ఉంటాయి. మీ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. రెండు రకాలను బ్యాలెన్స్ చేస్తూ ఇన్వెస్ట్ చేసే విధానాలూ ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకున్నాకే పెట్టుబడి మొదలుపెట్టాలి.

ఇకపోతే ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌కైనా ఒక గోల్ ఉండడం అవసరం. మీ ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకుని, దానికి తగ్గట్టు సరైన సలహాలు సూచనలు తీసుకుని పెట్టుబడి మొదలుపెట్టాలి. రిస్క్ ఫ్యాక్టర్‌‌ను కూడా దృష్టిలో ఉంచుకుని విభిన్న పద్ధతుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే బాగుంటుందనేది నిపుణుల సలహా.

First Published:  30 May 2024 12:30 AM GMT
Next Story