Telugu Global
Business

Reliance-HDFC Bank | స్టాక్స్ `ఫ్రై`డే.. రిల‌య‌న్స్‌.. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ స‌హా ప్ర‌ధాన షేర్ల‌తో న‌ష్టాల్లో ఇండెక్స్‌లు..!

Reliance-HDFC Bank | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్ర‌వారం ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇంట్రాడే ట్రేడింగ్ శుభారంభాన్ని అందుకున్నా.. ఇండెక్స్ కీల‌క హెవీ వైట్స్ అమ్మ‌కాల ఒత్తిళ్ల‌కు గురి కావ‌డంతో శుక్ర‌వారం `ఫ్రై-డే`గా మారిపోయింది.

Reliance-HDFC Bank | స్టాక్స్ `ఫ్రై`డే.. రిల‌య‌న్స్‌.. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ స‌హా ప్ర‌ధాన షేర్ల‌తో న‌ష్టాల్లో ఇండెక్స్‌లు..!
X

Reliance-HDFC Bank | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్ర‌వారం ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇంట్రాడే ట్రేడింగ్ శుభారంభాన్ని అందుకున్నా.. ఇండెక్స్ కీల‌క హెవీ వైట్స్ అమ్మ‌కాల ఒత్తిళ్ల‌కు గురి కావ‌డంతో శుక్ర‌వారం `ఫ్రై-డే`గా మారిపోయింది. ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గుచూప‌డంతో స్క్రిప్ట్‌లు న‌ష్టాల పాల‌య్యాయి. ప్రారంభంలో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఆల్‌టైం గ‌రిష్టానికి దూసుకెళ్లింది. ఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 75,095 పాయింట్ల ఆల్‌టైం గ‌రిష్టానికి చేరుకుని త‌ర్వాత 550 పాయింట్ల ప‌త‌నంతో 74,050 పాయింట్లు, మ‌రోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ అంత‌ర్గ‌త ట్రేడింగ్‌లో 22,795 పాయింట్ల గ‌రిష్ట స్థాయికి దూసుకెళ్లి, తిరిగి 135 పాయింట్ల ప‌త‌నంతో 22,510 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో అనుకూల ప‌రిస్థితుల‌తో బ‌జాజ్ ట్విన్స్ పుంజుకున్నాయి.

శుక్ర‌వారం స్టాక్ మార్కెట్లలో న‌ష్టానికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్, లార్సెన్ అండ్ ట‌ర్బో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లే స‌గం కార‌ణం. వీటితోపాటు నెస్లే ఇండియా, భార‌తీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివ‌ర్ త‌దిత‌ర స్క్రిప్ట్‌లు భారీగా న‌ష్ట‌పోయాయి. మ‌రోవైపు బజాజ్ ఫైనాన్స్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ లాభాలు గ‌డించ‌గా, టాటా స్టీల్ మాత్ర‌మే మెరుగైన లాభాల‌తో ముగిసింది.

ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో ఓఎన్జీసీ, బీపీసీఎల్‌, బ‌జాజ్ ఆటో భారీగా ల‌బ్ధితో ముగిశాయి. కోల్ ఇండియా, హీరో మోటో కార్ప్ భారీగా న‌ష్ట‌పోయాయి. బ్రాడ‌ర్ మార్కెట్‌లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.1 శాతం పెరిగితే, స్మాల్ క్యాప్ 0.3 శాతం న‌ష్టంతో ముగిసింది. నిఫ్టీ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్‌, నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ మెట‌ల్ వంటి సెక్టార్లు ల‌బ్ధి పొంద‌డానికి కార‌ణం అయ్యాయి.

శుక్ర‌వారం ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నూత‌న గ‌రిష్టాన్ని తాకితే, బీఎస్ఈ సెన్సెక్స్ తిరిగి 75 వేల మార్కును తాకింది. టైటాన్‌, బ్రిటానియా సంస్థ‌లు ఆర్థిక ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నాయి. ఆర్బీఐ రిలీఫ్ క‌ల్పించ‌డంతో బ‌జాజ్ ఫైనాన్స్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ ఏడు శాతం ల‌బ్ధి పొందాయి. ప్రైవేట్ బ్యాంక్ `యెస్ బ్యాంక్‌`లో 2.1 శాతం ఈక్విటీ చేతులు మారింది.

First Published:  3 May 2024 7:49 AM GMT
Next Story