స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాల మధ్య అప్రమత్తత పాటిస్తున్న మదుపర్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ప్లాట్ గా ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యహహరిస్తున్నారు. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతో.. నిఫ్టీ 23,000 మార్క్‌పైనే ట్రేడింగ్ మొదలుపెట్టాయి. 11 గంటల సమయంలో సెన్సెక్స్ 183.30పాయింట్ల లాభంతో 76588.29 వద్ద.. నిఫ్టీ 73.15 పాయింట్ల లాభంతో 23228.50 వద్ద ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.26 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,760 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్ టీ, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, జొమాటో, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
+