Telugu Global
Business

లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాలతో పాటు మరోవైపు కార్పొరేట్‌ సంస్థల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న మదుపర్లు

లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మొదట రాణించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాలతో పాటు మరోవైపు కార్పొరేట్‌ సంస్థల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 444 పాయింట్లు కుంగి 77,175.93 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 156.70పాయింట్లు తగ్గి 23,369 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.09 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 31,165 వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.88 వద్ద కొనసాగుతున్నది.సెక్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, జొమాటో, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం పనిచేయలేదు. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు తమ విక్రయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. వరుసగా ఐదోరోజు గురువారం నికరంగా రూ. 7,170.87 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ. 7,639.63కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

First Published:  10 Jan 2025 11:03 AM IST
Next Story