Telugu Global
Business

లాభాల్లో దూసుకుపోతున్న సింగరేణి

మొదటి అర్ధభాగంలో రూ.4 వేల కోట్ల నికర లాభం.. 36 శాతం వృద్ధి

లాభాల్లో దూసుకుపోతున్న సింగరేణి
X

సింగరేణి కాలరీస్‌ లాభాల్లో దూసుకుపోతుందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. తీవ్ర వర్షాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఉన్నా బొగ్గు ఉత్పత్తిలో నిరుటితో పోల్చితే రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ నికర లాభం సాధించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.17,151 కోట్లు, కరెంట్‌ అమ్మకాల ద్వారా రూ.2,286 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు బొగ్గు, థర్మల్‌ పవర్‌ అమ్మకాల ద్వారా రూ.4 వేల కోట్ల లాభం ఆర్జించిందని పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయానికి రూ.2,932 కోట్ల లాభం రాగా, ఈసారి రూ.1,072 కోట్లు అదనంగా సాధించిందని వెల్లడించారు. మొత్తంగా లాభాల్లో 36 శాతం వృద్ధి సాధించామన్నారు. కొత్తగూడెం వీకే ఓసీ, ఇల్లెందు జేకే ఓసీలకు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ రావడం సంస్థ భవిష్యత్‌కు భరోసానిచ్చిందన్నారు.

First Published:  15 Nov 2024 6:52 PM IST
Next Story