Telugu Global
Business

సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా ఢమాల్‌

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాల ఎఫెక్ట్‌

సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా ఢమాల్‌
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. బుధవారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనుండటంతో నేటి ట్రేడింగ్‌ను నష్టాల్లోనే ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో కొనసాగుతున్నాయి. ఆటో, బ్యాకింగ్‌, ఎనర్జీ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,400 దిగువన ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటార్స్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 879 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద ట్రేడవుతుంటే.. నిఫ్టీ 279 పాయింట్లు కుంగి 24,395 వద్ద కదలాడుతున్నది.

కారణాలు ఇవే

  • బుధవారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడాల్సి ఉన్నది. దీనిపై మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 25 బేసిక్‌ పాయింట్లు రేటు తగ్గింపు ఉంటుందని మార్కెట్లలో అంచనాలు ఉన్నాయి. దీనికితోడు సమావేశంలో ఫెడ్‌ చీఫ్‌ ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారా? అనే విషయంపై ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.
  • విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) తిరిగి విక్రయదారులుగా మారడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఎఫ్‌ఐఐలు సోమవారం రూ. 279 కోట్ల నిధుల్ని వెనక్కి తీసుకున్నారు.
  • రూపాయి విలువ క్షీణిస్తున్నది. తాజాగా 84.92 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్టాన్ని తాకింది. ఇది కూడా సూచీల పతనానికి ఓ కారణంగా భావిస్తున్నారు.
First Published:  17 Dec 2024 2:12 PM IST
Next Story