Telugu Global
Business

200 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్, 24,000 దిగువన నిఫ్టీ

200 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్, 24,000 దిగువన నిఫ్టీ
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు వడ్డీ రేట్లపై త్వరలో ఫెడ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే నిఫ్టీ 23,950 దిగువన మొదలు కాగా.. సెన్సెక్స్‌ 260 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుని మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఉదయం 11.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 66.15 పాయింట్లు కుంగి 78,716.09 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 0.06 పాయింట్లు తగ్గి 23,980.85 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.13 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.16 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,739.30 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ 30 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

First Published:  5 Nov 2024 11:41 AM IST
Next Story