Telugu Global
Business

లాభాలతో ప్రారంభమైన సూచీలు

వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు లాభాల బాట

లాభాలతో ప్రారంభమైన సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు.. కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రతిపాదనలు రూపుదిద్దుకోవడం మార్కెట్ల సానుకూల సంకేతాలకు కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Sensex climbs 200 pts to 76,350 after US tariffs take shapeమార్కెట్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 23,100 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టగా.. సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.85 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 75.16 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,857.70 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 10.20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 163.40 పాయింట్ల లాభంతో 76302.37 వద్ద.. నిఫ్టీ 19.65పాయింట్లు పెరిగి 23051.05 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచీసీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, జొమాటో, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నష్టాల్లో కదలాడుతున్నాయి.



First Published:  14 Feb 2025 10:25 AM IST
Next Story