వడ్డీ రేట్లు పెంచేసిన ఎస్‌బీఐ
9 శాతానికి చేరిన వడ్డీ.. రుణగ్రహీతలపై పెను భారం
BY Naveen Kamera15 Nov 2024 10:10 AM GMT
X
Naveen Kamera Updated On: 15 Nov 2024 10:10 AM GMT
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్) ను ఐదు పాయింట్లు పెంచింది. దీంతో ఎస్‌బీఐ వడ్డీరేటు 9 శాతానికి పెరిగింది. పెంచిన వడ్డీ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మూడేళ్లు, ఆరేళ్ల కాల పరిమితితో తీసుకున్న వడ్డీ రేట్లు మాత్రమే పెంచుతున్నామని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఏడాది, రెండేళ్ల కాల పరిమితితో తీసుకున్న లోన్లకు వడ్డీ యథాతథంగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంసీఆర్‌ఎల్ ను ఎస్‌బీఐ రెండు సార్లు పెంచడంపై కష్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపుతో ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐల మొత్తం కూడా పెరుగుతుందని చెప్తున్నారు.
Next Story