Telugu Global
Business

Mahindra SUV Cars | ఎస్‌యూవీ కార్ల‌లో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా దూకుడు.. ఆ మూడు కార్ల‌పైనే పూర్తిగా ఫోక‌స్‌..!

Mahindra SUV Cars | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) సాధార‌ణ వాహ‌నాలు, త్రిచ‌క్ర వాహ‌నాలు, కార్లు, ట్రాక్ట‌ర్లు, ట్ర‌క్కులు త‌యారు చేస్తోంది.

Mahindra SUV Cars | ఎస్‌యూవీ కార్ల‌లో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా దూకుడు.. ఆ మూడు కార్ల‌పైనే పూర్తిగా ఫోక‌స్‌..!
X

Mahindra SUV Cars | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) సాధార‌ణ వాహ‌నాలు, త్రిచ‌క్ర వాహ‌నాలు, కార్లు, ట్రాక్ట‌ర్లు, ట్ర‌క్కులు త‌యారు చేస్తోంది. కార్ల‌లో ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్ (ఎస్‌యూవీ -SUV) కార్ల‌పై మోజు పెంచుకుంటున్నారు. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) ఎస్‌యూవీ (SUV) కార్ల‌కూ గిరాకీ బాగానే ఉంది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లోనే 1,24,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలై ఒక‌టో తేదీ నాటికి సుమారు 1.78 ల‌క్ష‌ల యూనిట్ల కార్లు ఓపెన్ బుకింగ్ అయ్యాయి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24)తో పోలిస్తే 24 శాతం వృద్ధి రేటు న‌మోదైంది. న్యూ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (XUV 3XO), బొలెరో (Bolero), థార్ (Thar), స్కార్పియో (ఎన్ అండ్ క్లాసిక్) (Scorpio -N and Classic). ఎక్స్‌యూవీ700 (XUV700) త‌దిత‌ర ఎస్‌యూవీ కార్ల‌ను మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) విక్ర‌యిస్తోంది.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో అత్య‌ధికంగా 58 వేల యూనిట్ల స్కార్పియో (Scorpio), 55 వేల ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (XUV 3XO), 42 వేల థార్ (Thar), 13 వేల ఎక్స్‌యూవీ700 (XUV700), ఎనిమిది వేల బొలెరో (Bolero) బుకింగ్స్ న‌మోద‌య్యాయి. జూన్‌లో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra)కు చెందిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (XUV 3XO) కార్లు 20 వేలు, స్కార్పియో (Scorpio) 12 వేలు, ఎక్స్‌యూవీ700 (XUV700) ఎనిమిది వేలు, బొలెరో (Bolero) ఆరు వేలు, థార్ (Thar) ఐదు వేలు బుకింగ్స్ న‌మోద‌య్యాయి.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో ప్ర‌తి నెలా స‌గ‌టున 41 వేల ఎస్‌యూవీ కార్లు బుక్ అయ్యాయి. కానీ, దాదాపు 10 శాతం బుకింగ్స్ ర‌ద్ద‌య్యాయి. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్‌లో రోజురోజుకు విస్త‌రిస్తోంది. 2019-20లో నెల‌కు 19 వేల ఎస్‌యూవీ కార్లు బుక్ అయితే, 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నెల మార్చిలో 49 వేల యూనిట్ల కార్లు బుక్ అయ్యాయి.

త‌మ ఎస్‌యూవీ కార్ల‌కు గిరాకీ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) భారీ ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకున్న‌ది. ఈ ఏడాది ప్ర‌తి నెలా 64 వేల యూనిట్ల ఎస్‌యూవీ కార్ల బుకింగ్స్ ల‌క్ష్యంగా అడుగులేస్తున్న‌ది. ఇందులో థార్ రాక్స్ 5 డోర్ (Thar Roxx 5-door) కార్లు 5,000, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (XUV 3XO), ఎక్స్‌యూవీ 400 (XUV400)ల‌తోపాటు మొత్తం 15 వేలు, త్వ‌ర‌లో రానున్న బార్న్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ (బీఈవీ) మోడ‌ల్ కార్లు 10 వేలు ఉంటాయ‌ని తెలుస్తోంది.

First Published:  5 Aug 2024 7:53 AM GMT
Next Story