Telugu Global
Business

జియో ఫైనాన్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన రిలయన్స్‌

ఈ యాప్‌ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్లు, హౌస్‌ లోన్స్‌, యూపీఐ పేమెంట్స్‌, మొబైల్‌ రిఛార్జ్‌, క్రెడిట్‌ కార్డు బిల్లు పేమెంట్స్‌ సదుపాయం

జియో ఫైనాన్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన రిలయన్స్‌
X

జియో ఫైనాన్స్‌ యాప్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. మే 30న దీనికి సంబంధించిన బీటా వెర్షన్‌ను సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల నుంచి సూచనలు, సలహాల మేరకు నేడు పూర్తిస్థాయి యాప్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ స్టోర్‌, మై జియో యాప్‌లో ఇది అందుబాటులో ఉన్నది. ఇందులో మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్లు, హౌస్‌ లోన్స్‌, యూపీఐ పేమెంట్స్‌, మొబైల్‌ రిఛార్జ్‌, క్రెడిట్‌ కార్డు బిల్లు పేమెంట్స్‌ తదిరత సదుపాయాలు కల్పించారు. కేవలం 5 నిమిషాల్లో ఈ డిజిట్‌ సేవింగ్‌ ఖాతా తెరవచ్చని కంపెనీ తెలిపింది. బయోమెట్రిక్‌, ఫిజికల్‌ డెబిట్‌ కార్డుతో సురక్షితమైన బ్యాంకు ఖాతాను పొందవచ్చని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

రీఛార్జీలపై నో ఫీ

జియో యాప్‌లో ఉన్న డేటా ప్రకారం.. మొబైల్‌ రీఛార్జీలపై ఇప్పటికే యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే జియో ఫైనాన్స్‌ యాప్‌ ద్వారా చేసే రీఛార్జీలపై ఎలాంటి ఫీ ఉండదు. ఈజీగా సేవింగ్‌ ఖాతా తెరవవచ్చు. యూపీఐ లావాదేవీలపై ఆకట్టుకునే రివార్డు పాయింట్లు ఇవ్వనున్నది. మ్యూచువల్‌ ఫండ్స్‌పై లోన్‌ తీసుకోవచ్చు. సులువుగా చాట్‌ చేసి లోన్‌ అప్రూవల్‌ పొందవచ్చు. మరో సౌకర్యం ఏమిటంటే జియో ఫైనాన్స్‌ అందించే సదుపాయలన్నీ ఏ సిమ్‌కార్డు సాయంతోనైనా పొందవచ్చు.

First Published:  11 Oct 2024 6:20 AM GMT
Next Story