RBI-Repo Rate | ఇల్లు, కార్ల రుణ గ్రహీతలకు ఆర్బీఐ బిగ్ రిలీఫ్..వడ్డీరేట్లు యధాతథం..!
RBI-Repo Rate | ఆర్బీఐ మరో దఫా రెపోరేట్ యధాతథంగా 6.5 శాతంగా కొనసాగిస్తూ తన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకున్నది. ఇలా రెపోరేట్ యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం ఇది ఎనిమిదో సారి.
RBI-Repo Rate | ఆర్బీఐ మరో దఫా రెపోరేట్ యధాతథంగా 6.5 శాతంగా కొనసాగిస్తూ తన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకున్నది. ఇలా రెపోరేట్ యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం ఇది ఎనిమిదో సారి. వడ్డీరేట్లు తగ్గించేందుకు రిటైల్ ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉన్న ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ప్రతికూలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. వేసవి కాలంలో వేడి వల్ల కూరగాయల ధరలు ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం అని శుక్రవారం మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో ప్రతికూల ద్రవ్యోల్బణంతో ఎల్పీజీ ధరల తగ్గింపునకు దారి తీసిందన్నారు. దీనివల్ల ఇండ్లు, కార్లు, ఇతర వాహనాల రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలకు రిలీఫ్ లభించింది. వడ్డీరేట్లు తగ్గించడానికి మరికొంత కాలం పడుతుందని ఆర్బీఐ చెబుతోంది.
ఖరీఫ్ సీజన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుందన్నారు శక్తికాంత దాస్. గ్లోబల్ ట్రేడ్ ధోరణులను బట్టి బహిర్గత డిమాండ్ కూడా గణనీయ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక రంగ పరివర్తనలో నూతన అధ్యాయాన్ని లిఖించేందుకు భారత్ సిద్దంగా ఉందని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాల్లో వరుస సంక్షోభాలు నెలకొన్నా దేశీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని గుర్తు చేశారు. నిత్యం అంతర్జాతీయ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిందేనన్న శక్తికాంత దాస్ గుప్తా.. వివిధ సవాళ్ల మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తున్నదని తెలిపారు.
విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య చట్టం (ఫెమా) చట్టానికి సవరణలతో త్వరలో కొత్త ముసాయిదా రూపొందిస్తామని శక్తికాంత దాస్ చెప్పారు. వస్తువులు, సర్వీసుల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఫెమా మార్గదర్శకాలను హేతుబద్దీకరించాలన్న ప్రతిపాదన కూడా కొత్త ముసాయిదాలో ఉంటుందన్నారు. ధృవీకృత డీలర్ బ్యాంకుల మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ఆఫర్లను విస్తరించడానికే ఫెమా మార్గదర్శకాల్లో సర్దుబాట్లు ఉంటాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.