Telugu Global
Business

యథాతథంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు

ఎలాంటి మార్పులు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి.

యథాతథంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు
X

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తున్నది. ఎలాంటి మార్పులు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి.

ఆర్బీఐ గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం. రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 7.3 శాతంగా వృద్ధి రేటును అంచనా వేశారు.
  • మెరుగైన వర్షపాతం నమోదు, తగిన నిల్వలతో ఈ ఏడాది చివరి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉన్నది.
  • సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీ పెరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చు.
  • తయారీ ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ విధానాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌ తదితర కారణాలతో తయారీ రంగం వృద్ది చెందుతున్నదని, ఆర్థికరంగం స్థిరంగా ఉన్నదని, బ్యాంకు కార్యకలాపాలు బలంగా ఉన్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు.
First Published:  9 Oct 2024 5:26 AM GMT
Next Story