నా ఒక్కడిపైనే కాదు.. మొత్తం ఇండస్ట్రీపై జరుగుతున్నయ్
ఐటీ దాడులపై స్పందించిన ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు
BY Naveen Kamera22 Jan 2025 4:20 PM IST
X
Naveen Kamera Updated On: 22 Jan 2025 4:20 PM IST
ఇన్‌కం ట్యాక్స్ అధికారులు తన ఒక్కడి ఇండ్లు, ఆఫీసుల్లోనే సోదాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోందని అది నిజం కాదని తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీపై సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. బుధవారం తన నివాసం నుంచి బయటకు వచ్చిన దిల్ రాజు ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు ఇండ్లు, ఆఫీసులతో పాటు మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులతో కూడిన 55 బృందాలు హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆయా నిర్మాణ సంస్థలు పొందుతున్న ఆదాయానికి చెల్లిస్తున్న పన్నులకు మధ్య తేడా ఉన్నట్టు ఈ సోదాల్లో గుర్తించారు. తనిఖీలు పూర్తయితే కాని ఏం జరిగిందనే విషయాలు వెలుగు చూసే అవకాశం లేదు.
Next Story