Maruti Suzuki - RC Bhargava | బుల్లి కార్లకు మున్ముందు ఫుల్ గిరాకీ.. మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ బార్గవ ఏం చెప్పారంటే..?!
Maruti Suzuki - RC Bhargava | దేశ వృద్ధిరేటుతో ఆటోమొబైల్ రంగ గ్రోత్ ఆధార పడి ఉంటుందని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ తేల్చి చెప్పారు.
Maruti Suzuki - RC Bhargava | దేశ వృద్ధిరేటుతో ఆటోమొబైల్ రంగ గ్రోత్ ఆధార పడి ఉంటుందని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ తేల్చి చెప్పారు. కానీ 2019-20లో పరిస్థితి తిరగబడిందని పేర్కొన్నారు. తొలుత వాహనాల్లో బీఎస్-6 ప్రమాణాలు పాటించాలన్న నిబంధన అమల్లోకి రావడం, అటుపై కొవిడ్ మహమ్మారి మానవాళిపై విరుచుకు పడటం, సెమీ కండక్టర్ల కొరత వంటి కారణాలతో 2019-20లో కార్లు మొదలు వామనాల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. తిరిగి 2022-23లో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకున్నదన్నారు. 2018-19 నాటి పరిస్థితులను అధిగమించిందన్నారు.
బీఎస్-6 ప్రమాణాలతో కార్ల తయారీ ఖర్చు పెరగడంతో ధరలూ పెరిగాయి. ఫలితంగా 2022-23లో బుల్లి కార్ల విక్రయాలు .. 2018-19 నాటి రెండు లక్షల యూనిట్ల కంటే తక్కువ స్థాయికి పడిపోయాయని ఆర్సీ భార్గవ చెప్పారు. బుల్లి కార్లు మినహా 2022-23లో మాదిరిగానే కార్ల విక్రయాలు సాధారణ స్థాయికి చేరాయని అన్నారు. 2023-24లో 41.30 లక్షల కార్లు అమ్ముడవుతాయని ఆయన అంచనా వేశారు. అయినా 2018-19 విక్రయాలతో పోలిస్తే నాలుగు శాతం తక్కువే. 2022-23తో పోలిస్తే 2023-24లో కేవలం ఆరు శాతం వృద్ధి రేటు మాద్రమే నమోదైందన్నారు.
2024లో కార్ల కంపోనెంట్స్, సెమీ కండక్టర్ల లభ్యత సాధారణ స్థాయికి చేరుకున్నది. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్లకు అనుగుణంగా కార్ల తయారీకి కొవిడ్ తరహా అడ్డంకులు లేవు. ఈ నేపథ్యంలోనే కార్ల తయారీ సంస్థల్లో పోటీ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఆకర్షణీయ ఫీచర్లతో పలు రకాల మోడల్ కార్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కార్ల తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటారు ఆర్‌సీ బార్గవ.
కానీ బుల్లి కార్లకు గిరాకీ లేకపోవడం ఒక ప్రధాన బలహీన అంశం అని ఆర్‌సీ భార్గవ చెప్పారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండొచ్చునని, 2024-25లో బుల్లి కార్లకు గిరాకీ స్వల్పంగా పెరిగినా, వచ్చే ఏడాదే కొంత గిరాకీ పెరగొచ్చునన్నారు. బీఎస్-6 ప్రమాణాలు అమలు చేయడం వల్ల టూ వీలర్స్ గిరాకీ తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. అలాగే బుల్లి కార్లకు గిరాకీ పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.