Telugu Global
Business

పది నిమిషాల్లోనే పాన్‌ కార్డు

ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?

పది నిమిషాల్లోనే పాన్‌ కార్డు
X

పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌) అన్ని బ్యాంకింగ్‌ ఆపరేషన్స్‌ కు తప్పనిసరి. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసే పాన్‌ కార్డు కోసం అప్లికేషన్‌ పెట్టుకొని రోజుల తరబడి ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ నిరీక్షణకు చెక్‌ పెట్టడానికి కొత్త విధానం తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ - పాన్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో అప్లికేషన్‌ పెట్టుకున్న కొన్ని నిమిషాల్లోనే పాన్‌ నంబర్‌ కేటాయిస్తారు. పాన్‌ కార్డును ఈ - మెయిల్‌ ఐడీకి మెయిల్ చేస్తారు. అందరికీ ఉపయోగపడే ఇన్‌స్టంట్‌ పాన్‌ కార్డు ఎలా పొందాలి.. అందుకు ఏం చేయాలో ఓ లుక్కేయండి.. ఈ - పాన్‌ జారీ పూర్తిగా ఉచితమని ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఈ - పాన్‌ కార్డు కోసం ఈ - ఫైలింగ్‌ పోర్టల్‌ ను సందర్శించి దాని హోమ్‌ పేజీలో ఇన్‌స్టంట్‌ ఈ పాన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. అక్కడ న్యూ ఈ - పాన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి కంటిన్యూ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. అన్ని కండీషన్స్‌ చదివాను.. తదుపరి కొనసాగించడానికి అంగీకరిస్తున్నాను అనే ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి.. ఆ తర్వాత ఆధార్‌ లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ కు ఓటీపీ వస్తుంది.. ఆరు అంకెల ఓటీపీని ఎంటర్‌ చేయాలి. యూఐడీఏఐ ఆధార్‌ వివరాలు ధ్రువీకరించడానికి కంటిన్యూ బటన్‌ క్లిక్‌ చేయాలి.. ఆ తర్వాత ఆప్లికేషన్‌ సబ్మిట్‌ చేసి.. వచ్చే అప్లికేషన్‌ నంబర్‌ రాసుకోవాలి. ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌ కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది. మెసేజ్‌ వచ్చిన పది నిమిషాల్లోనే రిజిస్టర్డ్‌ ఈ మెయిల్‌ ఐడీకి ఈ పాన్‌ కార్డు వస్తుంది. అప్లికేషన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా కూడా ఈ - పాన్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.

First Published:  11 Oct 2024 11:16 AM GMT
Next Story