Telugu Global
Business

పాన్‌ 2.0.. పాత కార్డు పనిచేస్తదా లేదా!?

ప్రజల సందేహాలకు ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సమాధానమిదే..

పాన్‌ 2.0.. పాత కార్డు పనిచేస్తదా లేదా!?
X

పాన్‌ 2.0కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రజలకు అధునాతన కార్డులు అందజేసేందుకు రూ.1,435 కోట్లు ఖర్చు చేయబోతుంది. సాంకేతికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్త కార్డులను క్యూఆర్‌ కోడ్‌ తో ఇష్యూ చేయనున్నారు. మరి పాన్‌ 2.0 కార్డులు వచ్చాక పాత పాన్‌ కార్డులు చెల్లుబాటు అవుతాయా? కొత్త కార్డులు తీసుకోవాలా? అనే సందేహాలకు ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సవివరమైన సమాధానాలు ఇచ్చింది. ఇప్పటికే పాన్‌ కార్డు ఉన్నవాళ్లు కొత్త కార్డులకు అప్లయ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత కార్డుల సేవలు యథావిధిగా కొనసాగుతాయి. పాన్‌ కార్డుల్లోని వివరాలు కరక్షన్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఈ - మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, పేరులోనూ ఏవైనా సవరణలు ఉంటే చేసుకోవచ్చు. ఆధార్‌ సాయంతో ఆయా వివరాలను ఎన్‌ఎస్‌డీఎల్‌, యూటీఐఎస్‌ఎల్‌ వెబ్‌సైట్ల నుంచి చేసుకోవాలని ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. 2017 -18 ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తున్న పాన్‌ కార్డులపై క్యూఆర్‌ ఉంది. అలాంటి క్యూఆర్‌ కోడ్‌ నే కొత్త కార్డులకూ ఇస్తారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పాన్‌ కార్డు డేటాలోని వివరాలు వస్తాయి. కాబట్టి పాత పాన్‌ కార్డులు ఉన్నవాళ్లు హైరానా పడాల్సిన అవసరమే లేదు. కొత్త కార్డుల కోసం పరుగులు పెట్టాల్సిన పని అంతకన్నా లేదు.

First Published:  27 Nov 2024 4:23 PM IST
Next Story