Business

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.

‘పనిచేసే వారిని మేనేజ్‌ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొంత మంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్‌ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్‌ వ్యవస్థ అవసరమని అనుకోవడం లేదు’ అని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేర్కొన్నారు.

ఎలీ ప్రస్తుతం మెటర్నటీ లీవ్ లో ఉన్నారు. మరికొంతకాలం బిడ్డకోసం సెలవు తీసుకుందామనుకున్న టైమ్ లో గూగుల్ షాకిచ్చింది. స్టీవ్ కూడా బిడ్డ కోసం రెండు నెలలు పెటర్నిటీ లీవ్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ దశలో వారి ఉద్యోగాలు తొలగించారు.

యశోద, రేయా కారుటూరి అక్కాచెల్లెళ్లు. ఒకరు యూఎస్, సెయింట్‌ లూయీలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. మరొకరు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివారు. పైగా వీరిద్దరికీ పూలతో మంచి సాన్నిహిత్యం ఉంది.

తాను ట్విట్టర్ సీఈవో గా ఉండాలా వద్దా అని ట్విట్టర్ వినియోగదారులకు ఎలాన్ మ‌స్క్ ఓ పరీక్ష పెట్టాడు. పోస్ట్ చేసిన ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు.

ఉద్దేశపూర్వకంగా ట్విట్టర్ నుంచి మహిళలను అధిక సంఖ్యలో తొలగించారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు ఉన్నాయని అంటున్నారు.

DigiYatra App: విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది.

ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారిస్తామని యాజమాన్యం ప్రకటించింది.

WhatsApp data leak: 50 కోట్ల మంది వాట్సప్ వినియోగదారుల వివరాలు లీక్ అయ్యాయి. ఈ డేటాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ ఆన్ లైన్ లో ఆ నెంబర్లను అమ్మకానికి పెట్టాడు. అందులో భారతీయుల డేటా కూడా ఉంది.

వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. “మేక్ అమెజాన్ పే” పేరుతో నిరసన ప్రచారం జరుగుతోంది.