Maruti Suzuki Alto | భారత్‌లో 50 లక్షల కార్లు విక్రయించిన ఎంట్రీ లెవెల్ మోడల్ ఇదేనా.. కారణమిదేనా..!
Maruti Suzuki Alto | భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారు అంటే మీకు మారుతి సుజుకి వ్యాగన్ఆర్, హ్యుండాయ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుండాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, లేదా టయోటా ఇన్నోవా పేర్లు గుర్తుకు వస్తున్నాయా..?.. ఎంతో కాలంగా గుర్తుకు వచ్చే కారు అది.. అలా అనగానే మారుతి సుజుకి 800 స్పురణకు వస్తుంది.
Maruti Suzuki Alto | భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారు అంటే మీకు మారుతి సుజుకి వ్యాగన్ఆర్, హ్యుండాయ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుండాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, లేదా టయోటా ఇన్నోవా పేర్లు గుర్తుకు వస్తున్నాయా..?.. ఎంతో కాలంగా గుర్తుకు వచ్చే కారు అది.. అలా అనగానే మారుతి సుజుకి 800 స్పురణకు వస్తుంది. వాస్తవంగా మారుతి సుజుకి 800 మోడల్ కారు లెజెండరీ మోడల్ కూడా. అలా మనం మాట్లాడుకోవాలంటే మారుతి సుజుకి ఆల్టో వస్తుంది. భారత్‌లో 50 లక్షల కార్లు విక్రయించిన మోడల్ కూడా మారుతి సుజుకి ఆల్టో మాత్రమే. 2000లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు మారుతి ఆల్టో ఇప్పటి వరకు 50.60 లక్షల కార్లు విక్రయించింది. ఈ రికార్డును ఇతర కార్లు బ్రేక్ చేస్తాయా.. అంటే సాధ్యం కాదని చెప్పగలం. మారుతి సుజుకి ఆల్టో తర్వాత అత్యధికంగా అమ్ముడైన కారు హ్యుండాయ్ ఐ10. ఇప్పటివరకు భారత్ మార్కెట్లో 33 లక్షల హ్యుండాయ్ ఐ10 మోడల్ కార్లు అమ్ముడు పోయాయి.
2000-2022 మధ్య 17 ఏండ్ల పాటు భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి ఆల్టో ఉన్న పాపులారిటీ అది. 2000లో మారుతి సుజుకి ఆల్టో 800 ఆవిష్కరిస్తే, దాని స్థానంలో 2010లో మారుతి సుజుకి ఆల్టో కే10 వచ్చేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో కే10 మాత్రమే విక్రయిస్తున్నారు. కానీ, 2023 మార్చిలో మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు `ఆల్టో 800`ను డిస్‌కంటిన్యూ చేసింది. రెండో దశ బీఎస్-2 ప్రమాణాల అమలుకు అనుగుణంగా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడానికి ముందుకు రాలేదు. సేల్స్ కొద్ది కొద్దిగా మాత్రమే ఉండటంతో ఆర్థికంగా మారుతి సుజుకి బీఎస్-2 ప్రమాణాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాబోదని భావించింది. తదనుగుణంగా 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మారుతి సుజుకి ఆల్టో 800 కారు భారత్ మార్కెట్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది.
మారుతి సుజుకి ఆల్టో కే10 మోడల్ కారు 1.0-లీటర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 67 పీఎస్ విద్యుత్, 89ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో వస్తుంది. సీఎన్జీ ఆప్షన్ ఇంజిన్ కూడా మార్కెట్లోకి వచ్చింది. సీఎన్జీ వేరియంట్ గరిష్టంగా 57 పీఎస్ విద్యుత్, 82 ఎన్ఎం టార్క్ విత్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వచ్చింది. మారుతి సుజుకి ఆల్టో కే10 మోడల్ కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో వంటి కార్లతో మారుతి ఆల్టో కే10 మోడల్ కారు గట్టిగా పోటీనిస్తుంది.