Telugu Global
Business

రూ.39 వేలకే ఓలా స్కూటర్‌

పోర్టబుల్‌ బ్యాటరీతో అందుబాటులోకి

రూ.39 వేలకే ఓలా స్కూటర్‌
X

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీ సంస్థ మల్టీ పర్పస్‌ యూసేజీ కోసం కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందుబాటులోకి తేబోతుంది. గిగ్‌, ఎస్‌1 జెడ్‌ రేంజ్‌ లో కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఓలా గిగ్‌, ఓలా గిగ్‌ ప్లస్‌ పేర్లతో రాబోతున్న ఈ స్కూటర్‌ ధర రూ.39,999 నుంచి రూ.49,999 రేంజ్‌ లో ఉంటుందని వెల్లడించింది. ఎస్‌1 జెడ్‌ స్కూటర్‌ ధర రూ.59,999, ఎస్‌ జెడ్‌1 ప్లస్‌ ధర రూ.64,999గా నిర్ణయించింది. కేవలం రూ.499 చెల్లించి మంగళవారం నుంచే ఈ స్కూటర్లను బక్‌ చేసుకోవచ్చని ఓలా వెల్లడించింది. గిగ్‌ రేంజ్‌ టూ వీలర్స్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎస్‌1 రేంజ్‌ వెహికిల్స్‌ మే నుంచి డెలివరీ ఇస్తామని పేర్కొన్నది.

ఓలా గిగ్‌ : గిగ్‌ ప్లాట్‌ ఫామ్‌ వర్కర్ల కోసం గిగ్‌ స్కూటర్లు ఉపయోగపడుతాయని, రిమూవల్‌ బ్యాటరీతో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 112 కి.మీ.ల దూరం ప్రయాణిస్తుందని గంటకు 25 కి.మీ. స్పీడ్‌ తో వెహికిల్‌ ప్రయాణిస్తుందని పేర్కొన్నది.

ఓలా గిగ్‌ ప్లస్‌ : గిగ్‌ ప్లస్‌ టాప్‌ స్పీడ్‌ గంటకు 45 కి.మీ.లు. 1.5కేడబ్ల్యూహెచ్‌ డ్యూయల్‌ బ్యాటరీ ప్యాక్‌ తో దీనిని తీసుకువస్తున్నారు. సింగిల్‌ చార్జింగ్‌ తో 81 కి.మీ.లు ప్రయాణిస్తుంది, రెండు బ్యాటరీలను చార్జ్‌ చేసుకుంటే 157 కి.మీ.లు ప్రయాణించొచ్చు.

ఓలా ఎస్‌1 జెడ్‌ : ఈ స్కూటర్‌ నూ 1.5కేడబ్ల్యూహెచ్‌ డ్యూయల్‌ బ్యాటరీతో అందుబాటులోకి తెస్తున్నారు. 70 కి.మీ.ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్‌ దూసుకుపోతుంది. సింగిల్‌ బ్యాటరీతో 75 కి.మీ.లు, రెండు బ్యాటరీలు చార్జింగ్‌ చేసుకుంటే 146 కి.మీ.ల దూరం ప్రయాణించవచ్చు. ఎల్‌సీడీ డిస్‌ ప్లే, ఫిజికల్‌ కీ దీనిలో అదనపు ఫీచర్లు.

ఓలా ఎస్‌1 జెడ్‌ ప్లస్‌ : పర్సనల్‌, కమర్షియల్‌ యూసేజీ కోసం ఈ స్కూటర్‌ తెస్తున్నారు. దీనిలోనూ 1.5 కేడబ్ల్యూహెచ్‌ డ్యూయల్‌ బ్యాటరీలు ఉంటాయి. 70 కి.మీ.ల హయ్యెస్ట్‌ స్పీడ్‌ తో ఇది పని చేస్తుంది. దీనిలోనూ ఫిజికల్‌ కీ, ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు.

ఓలా పవర్‌ ప్యాడ్‌ : ఓలా పవర్‌ ప్యాడ్‌ పేరుతో పోర్టబుల్‌ ఇన్వర్టర్‌ అందుబాటులోకి తెస్తున్నారు. 1.5కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ సాయంతో 5 ఎల్‌ఈడీ బల్బులు, మూడు సీలింగ్‌ ఫ్యాన్లు, టీవీ, మొబైల్‌ ఫోన్‌, వైఫై రౌటర్‌ ను మూడు గంటల పాటు ఉపయోగించుకోవచ్చని ఓలా సంస్థ తెలిపింది. రూ.9,999లకే దీనిని మార్కెట్లోకి తీసుకువస్తున్నామని వెల్లడించింది.

First Published:  26 Nov 2024 6:01 PM IST
Next Story