Ola Roadster | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. విద్యుత్ వాహనాల రంగంలో ఉత్తుంగ తరంగం. ఏం చేసినా అద్భుతమే. తొలుత ఎస్1 (S1) పోర్ట్‌ఫోలియోతో ఈవీ స్కూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తాజాగా భారత్ మార్కెట్‌లోకి మూడు మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఎలక్ట్రిక్ మోటారు సైకిల్‌కు రోడ్‌స్టర్ (Roadster) అని పేరుతో తీసుకొచ్చింది. రోడ్‌స్టర్ (Ola Roadster)తోపాటు రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X), రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro) మోటారు సైకిళ్లనూ ఆవిష్కరించింది. రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X), రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro) మధ్య రోడ్‌స్టర్ (Ola Roadster) ధర ఉంటుంది. ఓలా రోడ్‌స్టర్ (Ola Roadster) మోటారు సైకిళ్ల ధర రూ.74,999 నుంచి ప్రారంభం అవుతుంది. బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) చివరి త్రైమాసికంలో ఓలా రోడ్‌స్టర్ (Ola Roadster) మోటార్ సైకిళ్ల డెలివరీ ప్రారంభించనున్నది.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X) ధర రూ.75,999 (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.99,999 మధ్య (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. ఓలా రోడ్‌స్టర్ (Ola Roadster) ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.40 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro) ధర రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) మోటారు సైకిల్ 2.5 కిలోవాట్లు (2.5kWh), 3.5 కిలోవాట్లు (3.5kWh), 4.5 కిలోవాట్ల (4.5kWh) బ్యాటరీ ప్యాక్‌లతో వస్తోంది. ఓలా రోడ్‌స్టర్ (Roadster) 3.5 కిలోవాట్లు (3.5kWh), 4.5 కిలోవాట్లు (4.5kWh), 6 కిలోవాట్ల (6kWh) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇక టాప్ హై ఎండ్ రోడ్‌స్టర్ ప్రో (Roadster Pro) 8 కిలోవాట్లు (8 kWh), 16 కిలోవాట్ల (16 kWh) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ 11 కిలోవాట్ల మోటార్‌తో వస్తోంది. సింగిల్ చార్జింగ్‌తో గంటకు 124 కి.మీ నుంచి 200 కి.మీ వరకూ ప్రయాణిస్తుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, మూడు రైడింగ్ మోడ్స్‌లో వస్తోంది. పలు ఫీచర్లతోపాటు 4.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది.

ఓలా రోడ్‌స్టర్ (Roadster) 13 కిలోవాట్ల మోటార్‌తో వస్తున్నది. కేవలం రెండు సెకన్లలో 40 కి.మీ వేగాన్ని పుంజుకోనున్న ఓలా రోడ్‌స్టర్ గంటకు గరిష్టంగా 126 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. 3.5 కిలోవాట్లు, 4.5 కిలోవాట్లు. 6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లతో కూడిన మోటార్‌తో గరిష్టంగా 248 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. నాలుగు రైడింగ్ మోడ్స్‌లో వస్తున్న రోడ్‌స్టర్.. 6.8 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్, ప్రాగ్జిమిటీ అన్‌లాక్, ఏఐ పవర్డ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లతో వస్తోంది.
ఓలా రోడ్‌స్టర్ ప్రో (Roadster Pro) 52 కిలోవాట్ల మోటార్‌తో వస్తోంది. ఈ మోటారు సైకిల్ గరిష్టంగా 194 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 1.2 సెకన్లలోనే 40 కి.మీ వేగంతో దూసుకు వెళుతున్నది. 10-అంగుళాల టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్, యూఎస్డీ ఫోర్క్, స్విచ్ఛబుల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి. హైపర్, స్పోర్ట్, నార్మల్, ఎకో డ్రైవింగ్ మోడ్‌లో లభిస్తుంది. ఐసీఈ ఇంజిన్ స్థానే బ్యాటరీ ప్యాక్ వస్తుంది. స్టీల్ ఫ్రేమ్ విత్ యూఎస్డీ ఫోర్క్స్, మోనోషాక్ పఫర్ సస్పెన్షన్, డ్యుయల్ ఫ్రంట్ డిస్క్‌లు, రేర్ డిస్క్ విత్ ఏబీఎస్ బ్రేకులు ఉంటాయి.