Telugu Global
Business

Ola Electric IPO | త్వ‌ర‌లో ఐపీఓకు ఓలా ఎల‌క్ట్రిక్.. క‌ల‌ల కార్ల‌ ప్రాజెక్ట్‌కు భ‌విష్ అగ‌ర్వాల్ రాంరాం ..!

Ola Electric IPO: 600 మిలియ‌న్ డాల‌ర్ల నిధుల సేక‌రణ ల‌క్ష్యంతో ఐపీఓ (IPO)కు వెళ్లుతున్న‌ది ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric).

Ola Electric IPO | త్వ‌ర‌లో ఐపీఓకు ఓలా ఎల‌క్ట్రిక్.. క‌ల‌ల కార్ల‌ ప్రాజెక్ట్‌కు భ‌విష్ అగ‌ర్వాల్ రాంరాం ..!
X

Ola Electric | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సాఫ్ట్‌బ్యాంక్ ద‌న్నుతో న‌డుస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ భ‌విష్య‌త్‌లో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారుచేయాల‌న్న ప్ర‌ణాళిక‌ను నిలిపేస్తున్న‌ట్లు కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి. కేవ‌లం మోటారు సైకిళ్ల‌తోపాటు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల త‌యారీపై దృష్టి సారించాల‌ని ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) వ‌ర్గాల క‌థ‌నం. త్వ‌ర‌లో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ కోసం ఐపీఓ (IPO)కు వెళ్లాల‌ని ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఆల్ గ్లాస్ రూఫ్‌తో కూడిన ఎల‌క్ట్రిక్ స్పోర్ట్స్ కారును రెండేండ్ల‌లో ఆవిష్క‌రిస్తామ‌ని 2022లో ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) ఫౌండ‌ర్ కం సీఈఓ భ‌విష్ అగ‌ర్వాల్ (Bhavish Aggarwal) స్వ‌యంగా వెల్లడించారు. నాలుగు సెక‌న్ల‌లో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంద‌ని పేర్కొన్నారు. 2023 సెప్టెంబ‌ర్‌లో ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న క‌ల‌ల ప్రాజెక్టు స్పోర్ట్స్ కారు ప్ర‌ణాళిక‌ను పున‌రుద్ఘాటించ‌వ‌చ్చు. 600 మిలియ‌న్ డాల‌ర్ల నిధుల సేక‌రణ ల‌క్ష్యంతో ఐపీఓ (IPO)కు వెళ్లుతున్న‌ది ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric). ఐపీఓకు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో ఓలా ఎల‌క్ట్రిక్ త‌న కార్ల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపేసిన‌ట్లు వార్త‌లు రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

మోటారు సైకిళ్ల‌తోపాటు టూ - వీల‌ర్స్ మార్కెట్‌పై ఓలా పూర్తిగా దృష్టి సారించింది. భార‌త్‌లో ఈవీ మార్కెట్ కోసం విద్యుద్ధీక‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తిగా ఊపందుకోలేదు. చార్జింగ్ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కొంత స‌మ‌యం ప‌డుతుంది అని ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం మౌలిక వ‌స‌తుల కల్ప‌న లోపంతోపాటు భార‌త్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల మార్కెట్ ముందు ప‌లు స‌వాళ్లు పొంచి ఉన్నాయ‌ని ఓలా ఎల‌క్ట్రిక్ వ‌ర్గాలు రాయిట‌ర్స్‌కు చెప్పాయి. ఇంకా వేగం పుంజుకోని ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రంగంలో టాటా మోటార్స్ వంటి సంస్థ‌ల‌తో పోటీ ప‌డాల‌ని ఓలా ఎల‌క్ట్రిక్ భావిస్తున్న‌ది.

దేశీయంగా ఇటీవ‌లి కాలంలో ఈ-స్కూట‌ర్లు పాపులారిటీ పెంచుకున్నాయి. శ‌ర‌వేగంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రుగుతున్న‌ది. ఈ ఏడాది జూన్ నాటికి 4.83 ల‌క్ష‌ల ఈ-స్కూట‌ర్లు విక్ర‌యించింది. ప్ర‌పంచంలోకెల్లా మూడో అతిపెద్ద మార్కెట్‌లో గ‌త జూన్‌లో కేవ‌లం 45 వేల ఎల‌క్ట్రిక్ కార్లు మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి. క‌నుక క‌నీసం రెండేండ్లు టూ వీల‌ర్స్ సేల్స్‌, బ్యాట‌రీ త‌యారీపైనే ఫోక‌స్ చేయాల‌ని ఓలా ఎల‌క్ట్రిక్ త‌ల పెట్టింది. అప్ప‌టి వ‌ర‌కూ ఓలా ఎల‌క్ట్రిక్ త‌న కార్ల త‌యారీ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. దీనిపై స్పందించేందుకు ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) నిరాక‌రించింది.

వ‌చ్చేనెల‌లో దేశంలోకెల్లా అతిపెద్ద ఐపీఓ ద్వారా ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ కానున్న‌ది. ఇప్ప‌టికీ న‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నా గ‌త మూడేండ్ల‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల మార్కెట్లో ఓలా ఎల‌క్ట్రిక్ 46 శాతం వాటా క‌లిగి ఉంది. గ‌తేడాది ఫేమ్‌-2 కింద ఈవీ టూ వీల‌ర్స్ మీద స‌బ్సిడీలు త‌గ్గిస్తూ న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత ఓలా ఎల‌క్ట్రిక్ త‌న విక్ర‌య ల‌క్ష్యాల‌నూ కుదించుకున్న‌ది.

ఇప్ప‌టికే ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఫౌండ‌ర్ భ‌విష్ అగ‌ర్వాల్‌.. త‌మిళ‌నాడులో ఓలా ఎల‌క్ట్రిక్ కార్ల ఫ్యాక్ట‌రీ స్థాపించారు. ఏడాదిలో ఇదే క్యాంప‌స్‌లో ప‌ది ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేయ‌గ‌ల నూత‌న ప్లాంట్ నిర్మించాల‌ని భ‌విష్ అగ‌ర్వాల్ ప్ర‌ణాళిక వేశారు. డల్‌, స్మాల్‌, మిడ్ సైజ్డ్ కార్ల త‌యారీలో నేష‌న‌ల్ ట్రెండ్‌ను బ్రేక్ చేయాల‌ని ఓలా ఎల‌క్ట్రిక్ ప్లాన్ వేసింది. కార్ల ప్రాజెక్టు కోసం ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) క‌న్స‌ల్టెంట్ల‌ను, 100 మందికి పైగా ఉద్యోగుల‌ను నియ‌మించుకుంద‌ని తెలిసింది. కానీ, వారిలో దాదాపు 30 శాతం మంది సిబ్బందిలో కొంద‌రు కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మ‌రి కొంద‌రు సంస్థ‌ను వీడిన‌ట్లు స‌మాచారం.

First Published:  26 July 2024 8:13 AM GMT
Next Story