Telugu Global
Business

24,900 మార్క్‌ పైనే కొనసాగుతున్న నిఫ్టీ

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

24,900 మార్క్‌ పైనే కొనసాగుతున్న నిఫ్టీ
X

దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు.. దేశీయంగా వెలువడుతున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలు సూచీల సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండగా.. నిఫ్టీ 24,900 మార్క్‌ పైనే కొనసాగుతున్నది.ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 353 పాయింట్ల లాభంతో 81,577.88 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,915 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.06గా ట్రేడవుతున్నది.

నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు రాణిస్తున్నాయి. టాటా కన్సూమర్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా, హిందుస్తాన్‌ యునిలివర్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

First Published:  21 Oct 2024 10:10 AM IST
Next Story