Telugu Global
Business

నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడి కానుండటంతో మదుపర్ల అప్రమత్తత

నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
X

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ వాణిజ్య యుద్ధ ఆందోళనలు మదుపర్లను వెంటాడుతున్నాయి. దీనికితోడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడి కానుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. 11.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 300.48 పాయింట్లు తగ్గి 77970.80 వద్ద, నిఫ్టీ 78.80 పాయింట్లు పడిపోయి 23617.50 వద్ద ట్రేడవుతున్నాయి. అంతకుముందు ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 280 పాయింట్లకు పైగా లాభంలో ఉన్నప్పటికీ.. ఆ జోరు ఎంతో సేపు నిలువలేదు. నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌, బీపీసీఎల్‌ షేర్లు రాణిస్తుండగా.. శ్రీరాం ఫైనాన్స్‌, అపోలో హాస్పిటల్స్‌, ఐటీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సురెన్స్‌ ఫేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

మరింత పడిపోయిన రూాపాయి

మరోవైపు రూపాయి విలువ నానాటికీ క్షిణిస్తున్నది. నేటి ట్రేడింగ్‌లో మరో 12 పైసలు తగ్గి 87.55 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది.

First Published:  6 Feb 2025 11:35 AM IST
Next Story