లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టిన సూచీలు
క్రమంగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు.. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. క్రమంగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు.. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 23,509 వద్ద ఉన్నాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 712.21 పాయింట్ల లాభంతో 77898.95 వద్ద.. నిఫ్టీ 189.60 పాయింట్లు పెరిగి 23550.65 వద్ద ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 86.98 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.59 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,853.30 వద్ద కదలాడుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ మాత్రమే నష్టాల్లో కదలాడుతున్నాయి.