లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో రాణిస్తున్నమార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాల సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్ సూచీలు రాణిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో నిష్టీ 23,400 మార్క్‌పైన ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 73 పాయింట్ల లాభంతో 77,146.49 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 68.15పాయింట్లు పెరిగి 23,412.90 వద్ద కదలాడుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.28 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 80.22 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,743.90 వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, టెక్‌మహీంద్రా, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జొమాటో, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.