Telugu Global
Business

మార్కెట్‌లో కొనుగోళ్ల కళ

లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు

మార్కెట్‌లో కొనుగోళ్ల కళ
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రమంగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు.. కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌, ఆటో, ఎనర్జీ రంగం షేర్లు కొనుగోల్ల మద్దతుతో రాణిస్తున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 335 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 23,000 మార్క్‌ పైనే ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.50 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్యూడ్‌ బ్యారెల్‌ ధర 80.75 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,686 వద్ద ట్రేడవుతున్నది.

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 335.04 పాయింట్లు లాభంతో 76,665 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 98.85 పాయింట్లు పెరిగి 23,184 వద్ద కదలాడుతున్నది. సెన్సక్స్‌ 30 సూచీలో ఎన్టీపీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌,హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగి రావడం కూడా మార్కెట్లు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

First Published:  14 Jan 2025 10:41 AM IST
Next Story