Telugu Global
Business

కొత్త ఏడాదిలోనూ పసిడి పరుగేనా?

10 గ్రాముల బంగారం ధర రూ. 90 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నమార్కెట్‌ విశ్లేషకులు

కొత్త ఏడాదిలోనూ పసిడి పరుగేనా?
X

పండుగలు, పెండ్లిళ్లు, ఫంక్షన్లయినా ముందుగా గుర్తుకువచ్చేది బంగారం. పసిడి ఇప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగానూ ఉపయోగపడుతుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్న మాట. వివిధ కారణాలతో ఈ ఏడాది బంగారం ధర అత్యంత గరిష్ఠస్థాయికి చేరుకున్నది. వచ్చే ఏడాది ఇదే ఒరవడి కొనసాగించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక అస్థిర పరిస్థితులు కొనసాగితే దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.85 వేలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. రూ. 90 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ. 79,350 వద్ద కొనసాగుతున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో రూ. 76, 000 వద్ద ట్రేడవుతున్నది. 2024లో పసిడిపై పెట్టుబడి పెట్టిన వారికి మెరుగైన ఫలితం వచ్చింది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 23 శాతం రాబడి అందించింది. దేశీయంగా అక్టోబర్‌ 30న ఏకంగా రూ. 82,400 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని చేరింది. వెండి కూడా 30 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది తొలిసారి కిలో వెండి ధర రూ.1 లక్ష మార్కు దాటింది. అంతర్జాతీయ విపణిలో ఈ ఏడాది ప్రారంభంలో ఔన్సు (31 గ్రాములు) బంగారం 2062 డాలర్లుగా ఉండగా.. ఒక దశలో 2790 డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం 2600 డాలర్ల ఎగువన ట్రేడవుతున్నది.

First Published:  31 Dec 2024 4:35 PM IST
Next Story