ఒడుదొడుకుల్లో సూచీలు
మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లిన సూచీలు ప్రస్తుతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లిన సూచీలు ప్రస్తుతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 55 పాయింట్లు పెరిగి 81,544 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ కూడా 27 పాయింట్లు కుంగి 24,941 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.48 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్స్ 2,693 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్30 సూచీలో ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, రిలయన్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎంఅండ్‌ఎం, మారుతీసుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్ల (FIIs) కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఐఐలు బుధవారం నికరంగా రూ. 3,436 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించింది. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 2,256 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.