Telugu Global
Business

కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్!

ఈ కొత్త ఏడాది నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయని మీకు తెలుసా? యూపీఐ పేమెంట్స్, సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ వంటి పలు విషయాలకు సంబంధించిన రూల్స్‌లో కొన్ని కీలకమైన మార్పులు అమలుకానున్నాయి.

కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్!
X

ఈ కొత్త ఏడాది నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయని మీకు తెలుసా? యూపీఐ పేమెంట్స్, సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ వంటి పలు విషయాలకు సంబంధించిన రూల్స్‌లో కొన్ని కీలకమైన మార్పులు అమలుకానున్నాయి. అవేంటంటే..

ఈ ఏడాది నుంచి వాడకుండా ఉన్న యూపీఐ అకౌంట్స్‌ రద్దు చేయబడతాయి. అంటే జనవరి 1 నుంచి ఒక సంవత్సరం పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరపని యూపీఐ ఐడీలన్నీ డిజేబుల్ అవుతాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం.. ఇలా అన్ని యాప్స్‌కు చెందిన యూపీఐ ఐడీలకు ఈ రూల్‌ వర్తిస్తుంది.

యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన డైలీ లిమిట్‌ను రోజుకు లక్ష రూపాయల వరకూ పెంచింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రూల్ ఈ ఏడాది నుంచి అమలు అవుతుంది. అలాగే విద్య, ఆరోగ్యం కోసం యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల లిమిట్స్.. రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెరిగింది.

ఇక సిమ్ కార్డుల విషయంలో మరో కొత్త మార్పు ఈ ఏడాది అమలుకానుంది. ఈ ఏడాది నుంచి సిమ్‌ కార్డు పొందడానికి డిజిటల్ కెవైసీ చేయించాల్సి ఉంటుంది. పేపర్ ఆధారిత కేవైసీ ఇకపై పనిచేయదు. ఇక నుంచి సిమ్ కార్డు తీసుకోవడానికి డాక్యుమెంట్స్ లేదా ఫొటో కాపీలను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఆన్‌లైన్‌లో ఐడెంటిటీ, అడ్రస్ వెరిఫై చేసుకునే డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నకిలీ సిమ్‌లతో జరిగే సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు.

ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లు ఈ ఏడాది నుంచి అమలులోకి వస్తాయి. వీటిసాయంతో పాలసీ వివరాలను సరళమైన భాషలో అర్థం చేసుకునేవీలుంటుంది. అలాగే ఈ ఏడాది మార్చి 14, 2024 వరకు ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వీలుంది.

2024 నుంచి దేశంలోని పెద్ద కార్ల కంపెనీలు వాహనాల ధరలన్నీ 2 నుంచి 3 శాతం మేర పెరగనున్నాయి. అలాగే 2024 నుంచి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు వర్క్ వీసాకు మారలేరు.

వీటితోపాటు ఈ ఏడాది నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయించబడతాయి. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ అకౌంట్స్‌లో నామినేషన్ గడువు జూన్ 30, 2024వరకూ పెరిగింది.

First Published:  2 Jan 2024 12:45 PM GMT
Next Story