Hyundai Alcazar Facelift 2024 | 3-రో ఎస్‌యూవీల్లో పోటాపోటీ.. సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్..ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hyundai Alcazar Facelift 2024 | ప్రస్తుతం భారతీయుల్లో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా తర్వాత స్పేసియస్‌గా ఉంటే స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) మీద మోజు పెంచుకుంటున్నారు.
Hyundai Alcazar Facelift 2024 | ప్రస్తుతం భారతీయుల్లో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా తర్వాత స్పేసియస్‌గా ఉంటే స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) మీద మోజు పెంచుకుంటున్నారు. రోజురోజుకు ఎస్‌యూవీ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. అందునా త్రీ రో 6/7 వరుసల ఎస్‌యూవీ సెగ్మంట్ కార్లు - మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700), మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N), టాటా సఫారీ (Tata Safari), ఎంజీ హెక్టార్ ప్లస్ (MG Hector Plus) వంటి కార్లకు గిరాకీ పెరుగుతున్నది. ఇక త్వరలో ఐపీఓకు వెళ్లనున్న హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తన అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ (Alcazar facelift) కారును వచ్చే సెప్టెంబర్‌లో ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది.
తొలుత హ్యుండాయ్ తన అల్కాజర్ (Hyundai Alcazar) కారును 2021లో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.16.77 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.21.28 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతోంది. భారతీయ మార్కెట్లో గణనీయ సంఖ్యలోనే హ్యుండాయ్ అల్కాజర్ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. 2021-22లో 25,894, 2022-23లో 26,696, 2023-24లో 20,753 కార్లు అమ్ముడయ్యాయి. కార్ల విక్రయాల్లో రోజురోజుకు పోటీ పెరిగిపోవడంతో హ్యుండాయ్ మోటార్ ఇండియా తన అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ కారును వచ్చే సెప్టెంబర్‌లో ఆవిష్కరించడానికి సిద్ధమైంది.
హ్యుండాయ్ అల్కాజర్ (Hyundai Alcazar) రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5-లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ (160 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్క్), 1.5-లీటర్ల సీఆర్డీఐ డీజిల్ (116పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం) ఇంజిన్లతో వస్తోంది. పెట్రోల్ కారు వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డీసీటీ, డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ చాయిస్‌లో లభిస్తుంది. తాజా అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారులోనూ ఈ పవర్‌ట్రైన్ ఆప్షన్ కార్లు ఉంటాయని భావిస్తున్నారు.
పుష్కలమైన ఫీచర్లతో వస్తున్న హ్యుండాయ్ అల్కాజర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, 8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 8-స్పీకర్ బోస్ ఆడియో సెటప్, ఎయిర్ ప్యూరిఫయర్, డాష్ కామ్ విత్ డ్యుయల్ కెమెరా, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, బ్లూలింక్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు జత చేశారు.
హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar facelift) కారులో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) తదితర ప్రీమియం ఫీచర్లు జత చేస్తారని భావిస్తున్నారు. అప్‌డేటెడ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ కారు ధర రూ.17 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) పలుకుతుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ ఎక్స్‌టర్, హ్యుండాయ్ వెన్యూ, హ్యుండాయ్ క్రెటా, హ్యుండాయ్ టక్సన్‌తోపాటు అల్కాజర్ కార్లను విక్రయిస్తోంది. అదనంగా ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.