Tata Curvv – Hyundai Alcazar | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. సేఫ్టీ, కంఫర్టబుల్ ఫీచర్లు గల కార్ల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఎస్‌యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. కార్ల తయారీ సంస్థలు సైతం కస్టమర్లకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఫీచర్లతో కార్ల తయారీకి పోటీ పడుతున్నాయి. హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) ఆయా సెగ్మెంట్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ రెండు కార్లకు టాటా కర్వ్ (Tata Curvv), హ్యుండాయ్ అల్కాజర్ (Hyundai Alcazar) కార్ల నుంచి గట్టి పోటీ ఎదురు కానున్నది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) క్రెటా 161,653 కార్లు విక్రయించింది. తర్వాతీ స్థానంలో మహీంద్రా (Mahindra).. 141,462 స్కార్పియో (ఎన్ అండ్ క్లాసిక్) కార్లు విక్రయించింది.
వాల్యూ ఫర్ మనీ అంటే బెస్ట్ సెల్లర్‌గా క్రెటా నిలిచింది. రూ.25 లక్షల్లోపు (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉన్న ఎస్‌యూవీ కారు మహీంద్రా స్కార్పియో కావడంతో బెస్ట్ కార్లలో ఒకటిగా నిలిచింది. స్టాండర్డ్ హ్యుండాయ్ క్రెటా కారు ధర రూ.11 లక్షల నుంచి రూ. 20.15 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలికింది. ఇటీవల మార్కెట్‌లో ఆవిష్కరించిన క్రెటా ఎన్ కారు ధర రూ.16.82 లక్షల నుంచి రూ.20.45 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతోంది. మహీంద్రా స్కార్పియో ఎన్ (Scorpio-N) కారు ధర రూ.13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. స్కార్పియో క్లాసిక్ ధర రూ.13.62 లక్షల నుంచి రూ.17.42 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
హ్యుండాయ్ క్రెటాకు గట్టి పోటీనిచ్చేందుకు టాటా మోటార్స్ కూపే ఎస్‌యూవీ మోడల్ కారు టాటా కర్వ్ (Tata Curvv) వచ్చే నెల మార్కెట్‌లోకి వస్తోంది. ఇప్పటికే టాటా కర్వ్ కారును ఆవిష్కరించింది. వచ్చేనెల రెండో తేదీన టాటా కర్వ్ కారును మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది టాటా మోటార్స్.
బహుళ ఫీచర్లతో కూడిన టాటా కర్వ్ (Tata Curvv) ఎస్‌యూవీ కారు మల్టీపుల్ పవర్ ట్రైన్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తోంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, టెయిల్ ల్యాంప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, గెస్చర్ కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్ గేట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, సిక్స్ వే పవర్డ్ డ్రైవర్ సీట్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఫోర్ స్పోక్ డిజిటల్ స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేటెడ్ లోగో, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ బై హార్మన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ బేస్డ్ హవాక్ కంట్రోల్స్, నైన్ స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ ఉంటాయి.
నెక్సాన్ (Nexon), హారియర్ (Harrier), సఫారీ (Safari)తోపాటు వచ్చేనెల మార్కెట్లోకి రానున్న టాటా కర్వ్ (Tata Curvv) కారు కూడా ప్రామాణికంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (electronic parking brake), హిల్ హోల్డ్ కంట్రోల్ (hill hold control), హిల్ డిసెంట్ కంట్రోల్ (hill descent control), 360-డిగ్రీ కెమెరా (360-degree camera), 360-డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్ విత్ బ్లైండ్ వ్యూ మానిటర్ (360-degree surround view system with blind view monitor), ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు (front parking sensors) కూడా ఉన్నాయి. ఈ కారు లెవెల్ 2 అడాస్ విత్ 20 ఫంక్షనాలిటీస్‌తో వస్తున్నాయి. భారత్ ఎన్-క్యాప్ వద్ద టాటా కర్వ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్నది.
టాటా కర్వ్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2-లీటర్ల రివోట్రోన్ పెట్రోల్ (120పీఎస్ విద్యుత్, 170ఎన్ఎం టార్క్), 1.2-లీటర్ల హైపరియాన్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ (125పీఎస్ విద్యుత్, 225 ఎన్ఎం), 1.5-లీటర్ల కైరోజెట్ డీజిల్ ఇంజిన్ (118 పీఎస్ విద్యుత్, 260 ఎన్ఎం టార్క్) ఆప్షన్లలో లభిస్తుంది. మూడు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. టాటా కర్వ్ కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
హ్యుండాయ్ వచ్చేనెల తొమ్మిదో తేదీన తన అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ కారు ఆవిష్కరించనున్నది. హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar facelift) కారు డార్క్ క్రోమ్ గ్రిల్లె, న్యూ క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హెచ్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, న్యూ బంపర్లు, 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. క్యాబిన్ నోబెల్ బ్రౌన్, హేజ్ నేవీ రంగులతోపాటు డ్యుయల్ టోన్ ఫినిష్ రంగుల్లో వస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ల కోసం ఇంటిగ్రేటేడ్ డ్యుయల్ స్క్రీన్ లేఔట్ ఉంటుంది. డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 అడాస్ ఫీచర్లు అదనంగా వస్తుంది.
హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar facelift) కారు 1.5-లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ (Turbo GDi petrol engine)తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 160 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 1.5-లీటర్ల సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ (CRDi diesel engine)తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 116 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. మీరు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ కొనాలనుకుంటే 6స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, డీజిల్ ఇంజిన్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకుంటే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ (The Hyundai Alcazar facelift) కారు ధర రూ.17 లక్షల నుంచి రూ.23 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.