Mercedes Benz EQA Facelift | జూలై 8న మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ.. సింగిల్ చార్జింగ్‌తో 423 కి.మీ దూరం ప్రయాణించొచ్చు..!
Mercedes Benz EQA Facelift: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా (Mercedes-Benz India).. దేశీయ మార్కెట్‌లో మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది. ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) వర్షన్ కారును వచ్చే నెల ఎనిమిదో తేదీన ఆవిష్కరించనున్నది.
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా (Mercedes-Benz India).. దేశీయ మార్కెట్‌లో మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది. ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) వర్షన్ కారును వచ్చే నెల ఎనిమిదో తేదీన ఆవిష్కరించనున్నది. దీంతో భారత్ మార్కెట్‌లో మెర్సిడెజ్-బెంజ్ ఆవిష్కరించిన నాలుగో ఎలక్ట్రిక్ కారు కానున్నది. భారత్‌లో ఇప్పటికే మూడు ఈవీ కార్లను ఆవిష్కరించిన మెర్సిడెజ్ బెంజ్.. మొత్తం ఆరు మోడల్ ఈవీ కార్లు ఆవిష్కరిస్తామని ఇంతకుముందే ప్రకటించింది. వచ్చేనెలలో మార్కెట్‌లోకి రానున్న ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) కారు ఈక్యూబీ ఎస్‌యూవీ (EQB SUV), ఈక్యూఈ ఎస్‌యూవీ (EQE SUV), ఈక్యూఎస్ (EQS) కార్లతో జత కలవనున్నది. బీఎండబ్ల్యూ ఎక్స్1 (BMW X1), వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ (Volvo XC40 Recharge), కియా ఈవీ6 (Kia EV6) కార్లతో `ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) పోటీ పడుతుందని భావిస్తున్నారు.
గతేడాది ఆగస్టులో మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (Mercedes-Benz EQA facelift) కారును తొలిసారి మార్కెట్‌లో ప్రదర్శించింది. మెర్సిడెజ్ బెంజ్ సిగ్నేచర్ స్టార్ ప్యాటర్న్, ఒక హెడ్ ల్యాంప్ నుంచి మరో హెడ్ ల్యాంప్‌కు స్ట్రెచెస్‌తో కూడిన లైట్ బార్, ఫ్రంట్ గ్రిల్లె వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈక్యూబీ ఎస్‌యూవీ (EQB SUV) కారులోని పలు విడి భాగాలతోపాటు ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) డిజైన్ ఉంటుంది. ఇన్‌సైడ్ క్యాబిన్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. అయితే, మెర్సిడెజ్ బెంజ్ తన ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (Mercedes-Benz EQA facelift) ఎంత ధర పలుకుతుందన్న సంగతిని ప్రకటించలేదు.
మెర్సిడెజ్ బెంజ్ (Mercedes-Benz) తన ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) కారులో వాడే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ల వివరాలు వెల్లడించలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లు, నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈక్యూఏ 250 (EQA 250), ఈక్యూఏ 250+ (EQA 250+), ఈక్యూఏ 300 4మ్యాటిక్ (EQA 300 4Matic), ఈక్యూఏ 350 4మ్యాటిక్ (EQA 350 4Matic) వేరియంట్లలో లభిస్తుంది. ఈక్యూబీ ఎస్‌యూవీ (EQB SUV) భారత్ మార్కెట్‌లో 66.5 కిలోవాట్ల బ్యాటరీతోపాటు ప్రతి యాక్సిల్‌పై రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 289 బీహెచ్‌పీ విద్యుత్, 520 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. ఈక్యూబీ 350 4మ్యాటిక్ (EQB 350 4Matic) కారు సింగిల్ చార్జింగ్‌తో గరిష్టంగా 423 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.